ETV Bharat / bharat

డీఆర్‌డీఓ ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డికి ఆర్యభట్ట పురస్కారం - ఆస్ట్రోనాటిక్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా గురించి చెప్పండి?

డీఆర్​డీఓ ఛైర్మన్ డాక్టర్ జీ. సతీశ్ రెడ్డి(g Sateesh Reddy) ప్రతిష్ఠాత్మక ఆర్యభట్ట అవార్డును అందుకున్నారు. శనివారం బెంగళూరులోని యూఆర్‌ఎస్‌సీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి ప్రదానం చేశారు. దేశంలో రక్షణ పరికరాల అభివృద్ధి, ఉత్పత్తి వ్యవస్థలను స్థాపించేందుకు బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు కోసం సతీశ్ రెడ్డి కృషి చేశారని రక్షణ మంత్రిత్వ శాఖ కొనియాడింది.

G Satheesh Reddy
సతీశ్‌రెడ్డి
author img

By

Published : Oct 10, 2021, 12:33 PM IST

డీఆర్‌డీఓ ఛైర్మన్‌(DRDO Chairman) డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డికి(Satish Reddy DRDO) 2021 ఏడాది ఆర్యభట్ట పురస్కారం లభించింది. ఈ మేరకు బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్‌(URSC Bengaluru) ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(astronomical society of india) ఈ పురస్కారాన్ని అందించింది. ఈ సందర్భంగా అంతరిక్ష రంగంలో ఆయన చేసిన సేవలను ఏఎస్‌ఐ ప్రశంసించింది. అధునాతన ఏవియానిక్స్, నావిగేషన్, క్షిపణి సాంకేతికతల అభివృద్ధి, పరిశోధనలకు డాక్టర్ జీ.సతీష్ రెడ్డి వ్యూహాత్మక మార్గదర్శకుడుగా నిలిచారని పేర్కొంది.

Satheesh Reddy
డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డి

మరోవైపు.. సతీశ్ రెడ్డి ప్రతిష్ఠాత్మకమైన ఆర్యభట్ట అవార్డును అందుకోవటంపై రక్షణ మంత్రిత్వ శాఖ(Defence Ministry of India) స్పందించింది. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలు, క్లిష్టమైన రక్షణ సాంకేతికతల్లో ఇతర దేశాల మీద ఆధారపడటాన్ని తగ్గించడంలో సతీశ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.