ETV Bharat / bharat

పన్ను నొప్పి అని వెళ్లిన మహిళపై డెంటిస్ట్​ అత్యాచారం - dentist raped women

చికిత్స కోసం వెళ్లిన మహిళపై ఓ వైద్యుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీలో జరిగింది. ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు.

uttarpradesh news
చికిత్స కోసం వచ్చిన మహిళపై డెంటిస్ట్​ అత్యాచారం
author img

By

Published : Nov 8, 2021, 8:44 PM IST

పన్ను నొప్పి అని ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వైద్యుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీలో జరిగింది.

మత్తుమందు ఇచ్చి..

గతనెల 16న పన్ను నొప్పి కారణంగా బాధితురాలు స్థానిక డెంటల్​ క్లీనిక్​కి వెళ్లింది. పన్ను తొలగించాలని డెంటిస్ట్​ చెప్పాడు. ఆ తర్వాత బాధితురాలికి అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి ఆమె పన్ను తొలగించాడు. ఆ వెంటనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను చిత్రీకరించాడు.

స్పృహలోకి వచ్చిన బాధితురాలిని అతడు బెదిరించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. వీడియోను బయటపెడతానని చెప్పాడు.

భర్త ఫిర్యాదుతో..

కొద్ది రోజుల తర్వాత ఈ విషయం బాధితురాలి భర్తకు తెలిసింది. ఈ ఘటనపై ఈనెల 3న బాధితురాలి భర్త స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఆదివారం అరెస్ట్​ చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో నిర్ధరణ అయిందని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి : మొబైల్​లో పోర్న్ చూసి.. 10 రోజుల్లో ముగ్గురు బాలికలపై..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.