ETV Bharat / bharat

దిల్లీ మద్యం కుంభకోణం కేసు.. సిసోదియాకు మరో 2 రోజులు కస్టడీ పొడిగింపు.. - delhi excise policy

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా కస్టడీని మరో 2 రోజులు పొడిగించింది CBI ప్రత్యేక కోర్టు. 3 రోజులు పొడిగించాలన్న సీబీఐ అభ్యర్థనను.. సిసోదియా న్యాయవాది వ్యతిరేకించారు. దర్యాప్తులో CBI అసమర్థత కారణంగా రిమాండ్‌ను పొడిగించాలని కోరడం సరికాదన్నారు.

delhi liquor scam MANISH SISODIA
delhi liquor scam MANISH SISODIA
author img

By

Published : Mar 4, 2023, 3:17 PM IST

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా కస్టడీని మరో 3 రోజులు పొడిగించాలన్న CBI అభ్యర్థనపై తీర్పునిచ్చింది ప్రత్యేక కోర్టు. మరో రెండు రోజులు సీబీఐ కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో సిసోదియా కస్టడీ శనివారంతో ముగియగా, ఆయన్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి.. మరో మూడు రోజులు పొడిగించాలని CBI కోరింది. సీబీఐ అభ్యర్థనను.. సిసోదియా న్యాయవాది వ్యతిరేకించారు. దర్యాప్తులో CBI అసమర్థత కారణంగా రిమాండ్‌ను పొడిగించాలని కోరడం సరికాదన్నారు. నిర్దోషిగా నిరూపించుకోవాలని సిసోదియాను పదేపదే కోరడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణకు సహరించడం లేదని చెప్పడాన్ని ఆక్షేపించిన సిసోదియా న్యాయవాది ఆ కారణంగా రిమాండ్‌ గడువు పెంచాలని కోరడం సరికాదన్నారు. మరోవైపు బెయిల్ పిటిషన్​పై మార్చి 15న విచారణ జరపాలని సీబీఐ తరపు న్యాయవాది కోరారు. దీనిని సిసోదియా తరఫు న్యాయవాది వ్యతిరేకించడం వల్ల మార్చి 10కి వాయిదా వేసింది కోర్టు.

దిల్లీ మద్యం విధాన రూపకల్పనలో.. మద్యం తయారీ దారులు, హోల్ సేల్, రిటైల్ వ్యాపారులకు లబ్ది చేకూరే విధంగా వ్యవహరించారనే ఆరోపణలతో మనీశ్​ సిసోదియా అరెస్టు చేశారు. మద్యం విధానం రూపొందించే సమయంలో.. మద్యం తయారీ దారులు, వ్యాపారులు తమకు అనుకూలంగా ఉండే అంశాలను చర్చించి చేర్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మద్యం విధానం అధికారికంగా విడుదల చేయకముందే.. డాక్యుమెంట్ మద్యం వ్యాపారుల వాట్సప్ గ్రూప్ లో ప్రత్యక్షమైందన్న సీబీఐ ఆరోపించింది. దీంతో పాటు.. వ్యాపారులు, తయారీ దారులు, ప్రభుత్వ పెద్దలు మధ్య జరిగిన చర్చల ఆధారాలు ధ్వంసం చేశారని సీబీఐ పేర్కొంది. గత ఏడాది ఆగస్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా.. గత ఆదివారం 8 గంటలకు విచారణ తర్వాత​ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసింది.

ఆప్​ నిరసనలు..
మనీశ్​ సిసోదియాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆమ్​ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సెంట్రల్​ దిల్లీలో నిరసన చేపట్టారు. సిసోదియాను విడుదల చేయాలంటూ( మనీశ్​ సిసోదియా కో రిహా కరో) నినాదాలు చేశారు. కార్యకర్తలతో నిర్వహించిన సమావేశం అనంతరం నిరసనలు వెల్లువెత్తాయి. దిల్లీ ప్రభుత్వం చేపట్టిన పనులను అడ్డుకోవడానికే మనీశ్​ సిసోదియాపై అసత్య ఆరోపణలు చేశారని ఆప్​ పేర్కొంది. కాగా, ఐదు రోజుల కస్టడీ అనంతరం సిసోదియాను సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ ఆందోళనలు చెలరేగాయి.

14 రోజుల కస్టడీ..
ఈ కేసులో మనీశ్​ సిసోదియాతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట రాఘవను కూడా సీబీఐ(రౌస్​ అవెన్యూ) ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. మాగుంట రాఘవ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. దీంతో, రాఘవకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జుడీషియల్​ కస్టడీ పొడిగించింది. కాగా, మార్చి 10న మాగుంట రాఘవ రెడ్డి అరెస్టు అయ్యారు. ఇక ఈయన బెయిల్​ పిటిషన్​.. మార్చి 13న రౌస్​ అవెన్యూ కోర్టులో విచారణకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.