ETV Bharat / bharat

ఎక్సైజ్​ పాలసీ కేసు ఫేక్​.. 800 మంది దాడి చేసినా ఏం లభించలేదు : కేజ్రీవాల్

Delhi Excise Policy Case : మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియాపై పెట్టింది ఫేక్​ కేసు అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ అన్నారు. 800 అధికారులు దాదాపు 4 నెలల పాటు దర్యాప్తు చేసినా.. వారికి ఏం దొరకలేదని పేర్కొన్నారు.

delhi excise policy case
delhi excise policy case
author img

By

Published : Nov 25, 2022, 7:30 PM IST

Delhi Excise Policy Case : దిల్లీ మద్యం కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియా పాత్రపై ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ మరోసారి స్పందించారు. మద్యం స్కాం ఒక ఫేక్​ కేసు అని.. కావాలనే సిసోదియాను ఇందులో ఇరికించారని ఆరోపించారు. ఈ కేసులో సీబీఐకి ఏ ఆధారాలు లభించలేదని అన్నారు. కాగా దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ తన మొదటి చార్జ్​షీటును శుక్రవారం సమర్పించింది.

"మనీశ్​ పేరు సీబీఐ చార్జ్​షీటులో లేదు. ఇది ఫేక్​ కేసు. సిసోదియాపై నిర్వహించిన సోదాల్లో ఏం దొరకలేదు. నాలుగు నెలలుగా 800 మంది అధికారులు దర్యాప్తు చేసినా ఏం లభించలేదు. దిల్లీ విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సిసోదియా.. పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించారు. అలాంటి మంచి వ్యక్తిపై ఓ తప్పుడు కేసు బనాయించి.. ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేశారు"

--అరవింద్ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

ఇద్దరు వ్యాపారస్థులతో పాటు మరో ఐదుగురిపై సీబీఐ చార్జ్​షీటు దాఖలు చేసింది. ఇందులో వ్యాపారస్థులతో పాటు హైదరాబాద్​కు చెందిన మద్యం వ్యాపారి. దిల్లీకి చెందిన ఇద్దరు మద్యం సరఫరాదారులు, మరో ఇద్దరు అధికారులు ఉన్నారు. అయితే సిసోదియా పేరు ఎఫ్​ఐఆర్​లో ఉన్నా.. చార్జిషీటులో చేర్చలేదు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన 60 రోజుల్లో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. నిందితులపై ఐపీసీలోని సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర), అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపినట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి : శ్రద్ధ హత్య కేసులో మరో ట్విస్ట్.. త్వరలోనే గుడ్​ న్యూస్​ అని.. అంతలోనే హత్య!

'నేను వీడియోకాల్​ లైవ్​లో చూస్తా.. నీ భార్యను కొట్టు​'.. ప్రియురాలి పైశాచికత్వం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.