ETV Bharat / bharat

పాటియాలాలో టెన్షన్​ టెన్షన్​.. ఇంటర్నెట్ సేవలు బంద్​ - పంజాబ్​ న్యూస్

Patiala violence: పాటియాలాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటర్నెట్​ సేవలను నిలిపివేశారు అధికారులు. శుక్రవారం జరిగిన ఘర్షణలకు బాధ్యులను చేస్తూ ముగ్గురు పోలీసు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

curfew-in-patiala-after-clashes-internet-services-banned-temporarily
పాటియాలాలో టెన్షన్​ టెన్షన్​.. ఇంటర్నెట్ సేవలు బంద్​
author img

By

Published : Apr 30, 2022, 12:19 PM IST

Patiala news today: పంజాబ్‌లోని పటియాలాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం 9:30 నుంచి నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొబైల్‌ ఇంటర్నెట్‌, ఎస్​ఎంఎస్​ సేవలను నిషేధిస్తూ పంజాబ్‌ హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. తప్పుడు వార్తలను ప్రజలు నమ్మకూడదని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసులు కోరారు. వాస్తవాలేంటో తామే చెప్తామన్నారు. జిల్లావ్యాప్తంగా భద్రతను కట్టు దిట్టం చేశారు.

మరోవైపు శుక్రవారం దాడి ఘటనకు బాధ్యులను చేస్తూ ముగ్గురు పోలీసు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎం భగవంత్ మాన్ ఆదేశాల మేరకు పటియాలా రేంజ్‌ ఐజీపీ, పటియాలా సీనియర్‌ ఎస్పీ, ఎస్పీలను బదిలీ చేశారు. వీరి స్థానంలో కొత్తవారికి బాధ్యతల అప్పగించారు. శుక్రవారం పటియాలాలో ఇరువర్గాలు ఘర్షణకు దిగిన ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

ఇదీ చదవండి: న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి: జస్టిస్ రమణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.