ETV Bharat / bharat

'కుర్రాళ్లంతా మందు కొడతారు.. అయితే ఏంటి?'- ఠాణాలో ఎమ్మెల్యే ధర్నా

డ్రంక్​ అండ్​ డ్రైవ్ కేసులో అరెస్టు చేసిన ఓ యువకుడిని విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ.. రాజస్థాన్​ జోధ్​పుర్​లోని ఓ పోలీస్ స్టేషన్​లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కన్వర్​ ధర్నా చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

congress mla strike in police station
పోలీస్ స్టేషన్​లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్నా
author img

By

Published : Oct 19, 2021, 3:13 PM IST

Updated : Oct 19, 2021, 3:42 PM IST

పోలీస్​ స్టేషన్​లో ఎమ్మెల్యే మీనా కన్వర్ ధర్నా

కాంగ్రెస్​ ఎమ్మెల్యే మీనా కుమార్​, తన భర్తతో కలిసి రాజస్థాన్​ జోధ్​పుర్​లోని ఓ పోలీస్​ స్టేషన్​లో ధర్నా చేపట్టారు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులో అరెస్టు చేసిన తమ బంధువుల అబ్బాయిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. 'పిల్లలంతా మద్యం తాగుతారు' అని మీనా కన్వర్​ చెప్పడం ఆ వీడియోలో వినిపించింది.

congress mla strike in police station
పోలీస్​ స్టేషన్​లో ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే మీనా కన్వర్​

"మా బంధువుల కుమారుడిని, అతనితో పాటు ఉన్నవారిని విడుదల చేయాలని పోలీసులను కోరాను. కానీ, వాళ్లు ఒప్పుకోలేదు. నాతో, నా భర్తతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. సంబంధిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాను. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ నాకు హామీ ఇచ్చారు."

-మీనా కన్వర్​, కాంగ్రెస్​ ఎమ్మెల్యే

ఇదీ చూడండి: కశ్మీర్​లో పౌరుల హత్యలపై ఎన్​ఐఏ దర్యాప్తు'

ఇదీ చూడండి: బస్సును కొట్టేసి పరారైన దొంగలు.. కానీ...

Last Updated : Oct 19, 2021, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.