ETV Bharat / bharat

21 పార్టీల నేతలకు ఖర్గే లేఖ.. 'భారత్ జోడో యాత్ర' ముగింపు సభకు ఆహ్వానం

భారత్ జోడో యాత్ర ముగింపు సభకు రావాలని 21 పార్టీలకు లేఖ రాశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. ఈ సభను మహాత్మా గాంధీకి అంకితం ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ద్వేషం, హింసకు వ్యతిరేకంగా జోడో యాత్ర ప్రజల గళాన్ని సమర్థంగా వినిపించడానికి వేదిక అయ్యిందన్నారు.

Bharat Jodo Yatra in Srinagar
భారత్ జోడో యాత్ర
author img

By

Published : Jan 11, 2023, 7:36 PM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర జనవరి 30న శ్రీనగర్​లో ముగియనుంది. ఈ ముగింపు సభకు హాజరుకావాల్సిందిగా భావసారూప్యత గల 21 పార్టీలకు లేఖ రాశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. భాజపా మిత్రపక్షాలతోపాటు వైకాపా, ఎంఐఎం, ఏఐయూడీఎఫ్‌, బీజేడీ, జేడీఎస్, బీఆర్‌ఎస్‌, ఆప్‌లకు ఖర్గే ఆహ్వానం పంపలేదు.

"ప్రస్తుతం భారత్​.. ఆర్ధిక, సామాజిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్లమెంటు, మీడియాలో ప్రతిపక్షాల గొంతును కేంద్రం నొక్కుతోంది. ప్రజలకు నేరుగా దేశ పరిస్థితులు వివరించి.. అందరినీ ఏకం చేయడం కోసమే భారత్‌ జోడో యాత్ర. 3,300 కి.మీ యాత్రలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక విభజన, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరచడం, సరిహద్దుల్లో పెరుగుతున్న ముప్పు వంటి అంశాలపై జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ లెవనెత్తింది. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, ఉద్యమకారులు, కళాకారులు, ఆధ్యాత్మికవేత్తలు ఎదుర్కొంటున్న అంశాలపై దేశవ్యాప్త చర్చకు జోడో యాత్ర శ్రీకారం చుట్టింది. యాత్ర ప్రారంభంలో భావసారూప్యత గల ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునివ్వగా.. పలు పార్టీల ఎంపీలు, నేతలు, మేథావులు ప్రజలు హాజరయ్యారు.

--మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

యాత్ర ముగింపు కార్యక్రమాన్ని జాతిపిత మహాత్మాగాంధీకి అంకితం చేస్తున్నట్లు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. ప్రస్తుత పాలకులు ప్రజా సమస్యలను ఒక పద్ధతి ప్రకారం పక్కదారి పట్టించారని ఆయన విమర్శించారు. దేశంలో ద్వేషం, హింస పెంచి పోషిస్తున్నారని కేంద్రంపై విరుచుకుపడ్డారు. వీటన్నింటి నుంచి దేశ ప్రజలను బయటకు తీసుకువచ్చి చైతన్య పరిచేందుకే జోడో యాత్ర నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ద్వేషం, హింసకు వ్యతిరేకంగా జోడో యాత్ర ప్రజల గళాన్ని సమర్థంగా వినిపించడానికి వేదిక అయ్యిందన్నారు ఖర్గే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.