దేశంలో సంచలనం సృష్టించిన 'పెగసస్' నిఘా వ్యవహారంపై(Pegasus snooping row) దర్యాప్తునకు సాంకేతిక నిపుణులు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది సుప్రీం కోర్టు(Supreme court on Pegasus). కమిటీ ఏర్పాటుకు సంబంధించి వచ్చే వారం ఉత్తర్వులు వెలువరించనున్నట్లు తెలిపింది సుప్రీం కోర్టు.
పెగసస్ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పలు విషయాలు వెల్లడించింది. గతంలో చెప్పినట్లుగా.. మధ్యంతర ఉత్తర్వులు వచ్చే వారం వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ వారమే ఉత్తర్వులు జారీ చేయాలనుకున్నప్పటికీ.. కమిటీ సభ్యుల ఎంపిక పూర్తి కాలేదని, అతి త్వరలో పూర్తి చేసి ఆదేశాలు ఇస్తామని పేర్కొంది.
ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్ సాఫ్ట్‌వేర్‌తో దేశంలోని ప్రముఖులు, రాజకీయ నేతలు, హక్కుల కార్యక్తలు, జర్నలిస్టులపై నిఘా వేసినట్లు ఓ మిడియా సంస్థ వరుస కథనాలు వెలువరించగా.. సంచలనంగా మారింది. దీనిపై దేశంలో రాజకీయ దుమారం చెలరేగింది. పెగసస్ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఆయా పిటిషన్లను పరిశీలించిన సుప్రీం కోర్టు.. సెప్టెంబర్ 13న తమ ఆదేశాలను రిజర్వ్ చేసింది. పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగించి కేంద్రం తప్పుదోవలో నిఘా వేసిందా? లేదా అనే విషయాన్ని మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే.. భద్రతా కారణాల దృష్టా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: Pegasus Spyware: పెగసస్‌పై సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు!