ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల జరుగుతున్న సంఘటనలు (UP Politics) భాజపాకు తలనొప్పి వ్యవహారంగా పరిణమించాయా అంటే.. అవుననే ఆ పార్టీ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. వీటి ప్రభావం త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (BJP UP election) ఏ మేరకు ఉంటుందోననే ఆందోళన వారిలో కనిపిస్తోంది.
గ్యాంగ్‌స్టర్ వికాస్‌దుబే ఎన్‌కౌంటర్ (Vikas Dubey encounter) సంఘటన దగ్గర నుంచి హాథ్రస్‌లో (Hathras case) బాలికపై అత్యాచారం, హత్య వరకు ఏ సంఘటన చూసినా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది. తాజాగా లఖింపుర్ ఖేరి వివాదం (Lakhimpur Kheri case), గోరఖ్‌పుర్‌లో పోలీసుల చేతిలో కాన్పుర్ వ్యాపారి ప్రాణాలు కోల్పోవడం (Kanpur Businessman murdered) వంటివి భాజపా నేతలను, యూపీ ప్రభుత్వ పెద్దలను కలవరపెడుతున్నాయి. వీటికి తోడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొనసాగిస్తున్న ఉద్యమం (Farmers protest BJP) కూడా తమకు నష్టం కలిగిస్తుందని వారు భావిస్తున్నారు.
హడావిడి విపక్షాలదే..
రాష్ట్రంలో కొనసాగుతున్న పరిణామాలు, వాటి ప్రభావంపై భాజపా జాతీయ నేతలు ఇటీవల దిల్లీలో సమావేశం నిర్వహించగా యూపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, ఇతర నేతలు పాల్గొని అంతా మంచిగా ఉందనే చెప్పారని తెలిసింది. ఆయా సంఘటనల తీవ్రత కన్నా ప్రతిపక్షాల హడావిడే ఎక్కువగా ఉందని, పార్టీ, ప్రభుత్వంపై సామాన్య ప్రజానీకానికి ఎలాంటి వ్యతిరేకత లేదని అధిష్ఠానానికి వివరించినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: