ETV Bharat / bharat

'కరోనా సోకిన గర్భిణీలకు ఆ ప్రాంతంలో గాయాలు' - latest corona virus news

కరోనా వైరస్​ బారిన పడిన గర్భిణీల ప్లెసెంటాలో గాయాలవుతున్నట్లు ఓ అధ్యయనం తెలిపింది. వైరస్​ సోకిన ఇతర వ్యక్తుల కంటే వారిపైనే ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని సూచించింది.

US study finds injuries in placentas of pregnant COVID-19 patients
'కరోనా సోసిన గర్భిణీలకు ఆ ప్రాంతంలో గాయాలు'
author img

By

Published : May 24, 2020, 6:01 AM IST

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా.. గర్భిణీలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలో కరోనాతో 16 మంది గర్భిణీల ప్లెసెంటా( పిండాన్ని మాతృకణజాలంతో కలిపే ప్రత్యేక నిర్మాణం)లో గాయాలైనట్లు తెలిపింది. చికాగోలోని నార్త్​వెస్టర్న్​ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ అధ్యయనం.. అమెరికన్​ జర్నల్ ఆఫ్​ క్లినికల్​ పాథాలజీలో ప్రచురితమైంది. ఇందులో కొవిడ్​ సోకిన గర్భవతుల ప్లెసెంటా ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు.

16 మంది రోగులలో.. 15 మంది పండంటి బిడ్డలకు జన్మనివ్వగా... వారంతా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఒక మహిళకు గర్భస్రావం జరిగిందని పేర్కొన్నారు. పిల్లలెవరూ వైరస్​ బారిన పడలేదని స్పష్టం చేశారు.

ఈ మహిళల్లో నలుగురు కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరగా.. ప్రసవానికి ముందు పాజిటివ్​​ నిర్ధరణ అయ్యినట్లు వివరించారు. మరో ఐదుగురికి ఎటువంటి లక్షణాలు గుర్తించలేదని స్పష్టం చేశారు. మిగిలిన వారిలో డెలివరీ కోసం వచ్చినప్పుడు వైరస్​ సోకినట్లు పేర్కొన్నారు.

ఆందోళన కలిగించే విషయం..

ఈ ఫలితాలు కాస్త ఆందోళన కలిగిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. మహిళల ప్లెసెంటాలో రక్తం గడ్డ కడ్డటం, రక్త నాలాలు అసాధారణంగా కనిపిస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది. కొవిడ్​ సంక్రమించిన గర్భిణీలపై ఇతర రోగుల కంటే ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. సాధారణంగా పిండానికి ప్లెసెంటా వెంటిరేటర్లుగా పనిచేస్తుందని, వాటికి గాయాలవడం ఆందోళన కలిగించే విషయమని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.