ETV Bharat / bharat

మెంతికూర అనుకుని గంజాయి​ కూర తిని... - UP Family Confuses Methi Leaves With gamjai leaves

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ ఆకతాయి సరదా.. నిండు కుటుంబం ప్రాణాల మీదకు తెచ్చింది. ఎండిన గంజాయి తెచ్చి.. మెంతి కూర అని ఇచ్చిన వ్యక్తి మాటలు నమ్మి కూర వండుకున్న కుటుంబం ఆసుపత్రిపాలైంది.

UP family cooks 'ganja sabzi', thinking it is 'methi'; gets hospitalised
మెంతికూర అనుకుని గంజాయి​ కూర తిన్న కుటుంబం!
author img

By

Published : Jul 2, 2020, 6:11 PM IST

Updated : Jul 2, 2020, 7:55 PM IST

ఉత్తర్​ప్రదేశ్ ​కన్నౌజ్​కు చెందిన ఓ కుటుంబం మెంతికూర అనుకుని.. గంజాయి కూర తిని ఆసుపత్రిపాలైంది. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం వారంతా మియాగంజ్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కన్నౌజ్​కు చెందిన నవల్​ కిశోర్ ఎండిన గంజాయి తెచ్చి ​ ఓం ప్రకాశ్​ కుమారుడు నితీశ్​కు ఇచ్చాడు. ఇది ఎండబెట్టిన మెంతికూర అని సరదాగా చెప్పాడు. విషయం తెలియక ఈ ఎండు గంజాయిని తీసుకెళ్లి వదిన పింకీకి ఇచ్చాడు నితీశ్ . పింకీ గంజాయిని కూర వండేసింది.

మెంతి కూర అనుకుని గంజాయి కూరతోనే కుటుంబంతా భోంచేశారు. ఇంకేముంది.. కాసేపటికే అందరికీ కళ్లు తిరగడం మొదలెట్టాయి. ఓంప్రకాశ్​ అతి కష్టం మీద బయటకు వెళ్లి ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పాడు. కాసేపటికే ఇంట్లో అంతా స్పృహ తప్పి పడిపోయారు.

సమాచారమందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెంతి కూర పేరిట గంజాయి ఇచ్చిన కిశోర్​ను అరెస్ట్​ చేసి విచారిస్తున్నారు. ఓం ప్రకాశ్​ కుటుంబానికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు.

2019లోనూ అచ్చం ఇలాగే మెంతికూర అనుకుని గంజాయి కూర తిని.. ఓ కుటుంబం ఆసుపత్రిపాలైన ఘటన ఫిరోజాబాద్​లో జరిగింది.

ఇదీ చదవండి: 'కరోనా ఉందని డౌట్​ ఉన్నా మృతదేహాలు అప్పగించండి'

Last Updated : Jul 2, 2020, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.