ETV Bharat / bharat

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం- నిందితుడు అరెస్ట్​ - latest rape news

దేశంలో మరో మూడు అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. రాజస్థాన్​లోని 15 ఏళ్ల బాలికపై ఓ కిరాతుకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. మధ్యప్రదేశ్​లోనూ రెండేళ్ల చిన్నారిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి ప్రయత్నించగా.. తల్లి రాకతో పరారయ్యారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఐదేళ్ల చిన్నారిపై బంధువు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Two escape after attempting to rape 2-year-old in Madhya Pradesh, police on lookout
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం- నిందితుడు అరెస్ట్​
author img

By

Published : Oct 7, 2020, 4:25 PM IST

హాథ్రస్​ అత్యాచార ఘటన అనంతరం దేశంలో పలు చోట్ల ఇలాంటి ఘటనలు అధిక సంఖ్యలో బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో రెండేళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన ఇద్దరు దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తల్లి రాకతో...

జబల్​పుర్​లో ఇద్దరు దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించి... ఒంటరిగా ఉన్న రెండేళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించబోయారు. అయితే చిన్నారి అరుపులతో ఇంటి బయటే ఉన్న తల్లి రావడం గమనించి, నిందితులు పరారయ్యారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఉత్తర్​ప్రదేశ్​లోనూ..

బదాయూ జిల్లా హజరత్​పుర్​ ప్రాంతంలో ఐదేళ్ల బాలికపై తన బంధువే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

రాజస్థాన్​లో...

రాజస్థాన్​లో 15 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఇద్దరు దుండగుల్లో ఒకరు ఈ కిరాతకానికి పాల్పడగా.. మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితురాలు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: 8 నెలల బిడ్డతో కలిసి తల్లి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.