ETV Bharat / bharat

దొంగలు అనుకుని మూకదాడి- ముగ్గురు మృతి

కరోనా లాక్​డౌన్​ వేళ మహారాష్ట్రలో పాల్ఘడ్​ జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు.. ముగ్గురు వ్యక్తులపై మూకదాడి చేసి, చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, 100మంది అదుపులోకి తీసుకున్నారు.

Three "thieves" beaten to death by villagers; 100 detained
లాక్​డౌన్​ వేళ మూకదాడి... ముగ్గురు మృతి
author img

By

Published : Apr 17, 2020, 3:37 PM IST

మహరాష్ట్ర పాల్ఘడ్​​ జిల్లాలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కొందరు దాడి చేసి చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, 100మందిని అదుపులోకి తీసుకున్నారు.

అసలు ఏం జరిగింది?

'ముగ్గురు వ్యక్తులు ముంబయి నుంచి కారులో వస్తున్నారు. వారిని మహారాష్ట్ర పాల్ఘడ్​​ జిల్లాలోని ధబాడి, ఖాన్వెల్​ మధ్యలో ఉన్న గాడ్చిన్​చలే గ్రామస్థులు గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో ఆపారు. ఆ ముగ్గుర్ని దొంగలుగా అనుమానించి, వారిపై రాళ్లదాడి చేశారు. చనిపోయేంతవరకు చితకబాదారు. కారును తీవ్రంగా ధ్వంసం చేశారు' అని పోలీసులు తెలిపారు.

సమాచారం అందిన వెంటనే అర్ధరాత్రి ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను శవపరీక్ష కోసం పాల్ఘడ్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: రోగికి సాయం కోసం బైక్​పై 430కి.మీ ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.