భారత్, చైనా సైనిక ఉన్నతాధికారుల నడుమ సరిహద్దు చర్చలు 11 గంటలపాటు సాగడం ఆసక్తికరంగా మారింది. దీనిపై సైనిక వర్గాలను ప్రశ్నించినప్పుడు.. భారత్, చైనా సైనిక సమావేశాలు ఎప్పుడూ సుదీర్ఘంగానే సాగుతాయని తెలిపాయి.
ఎందుకంటే..
దీనికి కారణాలను వివరిస్తూ.. 'ప్రతి అంశంపైనా కనీసం నాలుగుసార్లు చర్చించాల్సి ఉంటుంది. ఇరుపక్షాల వద్ద ఇద్దరు అనువాదకులు ఉంటారు. వీరు సదరు ప్రశ్నలు, సమాధానాలను తర్జూమా చేస్తారు. దీనికి సమయం పడుతుంది. దీనికితోడు సుదీర్ఘమైన సైనిక లాంఛనాలనూ పాటించాల్సి ఉంటుంది. తరచూ ఉద్రిక్తతలు నెలకొనడం, సరిహద్దు సమస్య సుదీర్ఘకాలంగా అపష్క్రితంగా ఉండటం వంటి కారణాల వల్ల చర్చించాల్సిన అంశాల జాబితా ఎక్కువగా ఉంటోంది. అందువల్లే సమావేశాలు సుదీర్ఘంగా జరుగుతుంటాయి. ఈ భేటీలు చుషుల్, దౌలత్ బేగ్ ఓల్డీ(లద్దాఖ్), నాథులా(సిక్కిం), బర్మ్ లా, కిబితు(అరుణాచల్ ప్రదేశ్)లో నిర్వహిస్తుంటారు' అని వివరించాయి.
ఇదీ చదవండి: మోదీ చేతుల్లోనే దేశం భద్రం!