ETV Bharat / bharat

వందమందితో ప్రార్థన.. చర్చి ఫాదర్ అరెస్ట్ - Priest arrested for conducting mass defying govt order

కేరళ చాలకుడిలోని ఓ చర్చి ఫాదర్​​.. నిబంధనను ఉల్లంఘించి 100మందితో ప్రార్థనను నిర్వహించారు. ఫలితంగా ఫాదర్​ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు.

Priest arrested for conducting mass defying govt order, case against 100-odd faithf
లాక్​డౌన్​ ఉల్లంఘనపై ఆ 100మందిపై కేసు నమోదు
author img

By

Published : Mar 23, 2020, 2:42 PM IST

Updated : Mar 23, 2020, 3:14 PM IST

దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో కేరళ ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. బహిరంగ సమావేశాలను నిర్వహించకూడదని తేల్చిచెప్పింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. త్రిస్సూర్​లోని ఓ చర్చి ఫాదర్​ ప్రార్థనను నిర్వహించారు. ఇందులో వందకుపైగా మంది పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఫాదర్​ను అదుపులోకి తీసుకున్నారు.

ఆ వంద మందిపై

చాలకుడిలోని కుడప్ఫుజలో 'లేడి ఆఫ్​ పర్​పెట్యువల్ హెల్ప్​'​ చర్చి ఫాదర్​ పౌలి పదాయట్టి.. ప్రభుత్వ ఆజ్ఞలు లెక్కచేయకుండా సోమవారం ప్రార్థన నిర్వహించారు. ఈ ప్రార్థనకు దాదాపు వంద మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఫలితంగా పోలీసులు ఆ ఫాదర్​ను, చర్చి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. వందమందిపై కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్​పై ఫాదర్​ను విడిచిపెట్టారు.

స్వీయ ఏకాంత చర్యలు, సామాజిక దూరం వంటివి పాటించాలని కేంద్రం ఇప్పటికే సూచనలు చేసింది కేంద్రం. ప్రజలు సమూహంగా ఎక్కడా గుమిగూడవద్దని.. వైరస్‌ దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఈ నిబంధనలు ఎవరైన ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

Priest arrested for conducting mass defying govt order, case against 100-odd faithf
అరెస్ట్​ అయిన 'లేడి ఆఫ్​ పర్​పెట్యువల్ హెల్ప్​'​ చర్చి ఫాదర్​ పౌలి పదాయట్టి

'లేడి ఆఫ్​ పర్​పెట్యువల్ హెల్ప్​'​ చర్చి

ఇదీ చూడండి : లాక్​డౌన్​ దిశగా సుప్రీం- ఇక అత్యవసర విచారణలు మాత్రమే!

Last Updated : Mar 23, 2020, 3:14 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.