ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో 'ఆరోగ్య వన్' అనే ఔషధ మొక్కలు, మూలుకల వనాన్ని శుక్రవారం ప్రారంభించారు. గుజరాత్ పర్యటలనో భాగంగా.. ఐక్యతా విగ్రహానికి సమీపంలోని కేవడియా గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ వనాన్ని మోదీ సందర్శించారు.


17 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న ఆరోగ్య వన్లో.. మానవాళి ఆరోగ్యానికి అవసరమైన ఔషధ మొక్కలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వనంలో ఎంపిక చేసిన 380 జాతుల మొక్కలను పెంచినట్లు చెప్పారు. మొక్కల ప్రత్యేకత, ఔషధ గుణాలను తెలుసుకునేందుకు వీలుగా వాటికి సంబంధించిన వివరాలను బోర్డులపై రాసి సందర్శకులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

ఆరోగ్య వన్లో లోటస్ పాండ్, యోగా కేంద్రం, ఇండోర ప్లాంట్ విభాగం, అల్బా గార్డెన్, డిజిటల్ ఇన్ఫర్మెషన్ వంటివి ఉన్నాయి.
-
#WATCH| Gujarat: Prime Minister Narendra Modi takes a tour of 'Arogya Van' in Kevadia after inaugurating it. pic.twitter.com/9QXx0IL3Jh
— ANI (@ANI) October 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH| Gujarat: Prime Minister Narendra Modi takes a tour of 'Arogya Van' in Kevadia after inaugurating it. pic.twitter.com/9QXx0IL3Jh
— ANI (@ANI) October 30, 2020#WATCH| Gujarat: Prime Minister Narendra Modi takes a tour of 'Arogya Van' in Kevadia after inaugurating it. pic.twitter.com/9QXx0IL3Jh
— ANI (@ANI) October 30, 2020
ఇదీ చూడండి:కేశూభాయ్' కుటుంబసభ్యులకు మోదీ పరామర్శ