ETV Bharat / bharat

దేశంలో తొలి దేశీయ యాంటీబాడీ డిటెక్షన్​ కిట్​ రెడీ - తొలి దేశీయ యాంటీబాడీ డిటెక్షన్​ కిట్

పుణెలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ.. తొలి దేశీయ యాంటీబాడీ డిటెక్షన్​ కిట్​ను రూపొందించింది. ఇది 2.5 గంటల్లో 90 నమూనాలను పరీక్షించగలుగుతుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు.

National Institute of Virology develops 1st indigenous antibody detection kit for COVID: Vardhan
'తొలి దేశీయ యాంటీబాడీ డిటెక్షన్​ కిట్​ సిద్ధం'
author img

By

Published : May 11, 2020, 6:24 AM IST

కరోనాపై పోరులో భాగంగా తొలి దేశీయ యాంటీబాడీ డిటెక్షన్​ కిట్​ను అభివృద్ధి చేసింది పుణెలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ (ఎన్​ఐవీ). కరోనా వ్యాప్తిపై నిఘా ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు.

2.5 గంటల్లో 90 నమూనాలను కలిపి పరీక్షించే సామర్థ్యం ఈ కిట్​ సొంతమని పేర్కొన్నారు హర్షవర్ధన్​. ఆరోగ్య నిపుణులు మరింత వేగంగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ కిట్​ అత్యంత సున్నితం, ఖచ్చితమైనదని అభివర్ణించారు.

దేశ జనాభాలోని సార్స్​-సీఓవీ2 ఉనికిని గుర్తించేందుకు ఈ కిట్​ సహాయం చేస్తుంది. దీనిని కేవలం కొన్ని నెలల్లోనే రూపొందించడం మరో విశేషం.

సరైన ఫలితాలు అందకపోవడం వల్ల చైనా కిట్ల వాడకాన్ని నిలిపివేసింది భారత్​. చైనాకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసుకుంది. ఇప్పుడు స్వయంగా భారత్​ ఈ కిట్లను అభివృద్ధి చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.