ETV Bharat / bharat

'ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించకపోగా ప్రజలపై నిందలా?' - రాహుల్​ గాంధీ కేంద్రంపై విమర్శలు

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ.. కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. కొవిడ్​ కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

Modi govt sometimes blames god, sometimes people, but not its 'misrule': Rahul
'ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించక.. ప్రజలపై నిందలా?'
author img

By

Published : Sep 21, 2020, 6:18 PM IST

Updated : Sep 21, 2020, 6:53 PM IST

కరోనా కేసుల పెరుగుదలకు ప్రజల బాధ్యతారాహిత్య ప్రవర్తనే కారణమన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యలపై.. తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. మోదీ ప్రభుత్వం కొన్నిసార్లు దేవుడిపై, మరికొన్నిసార్లు ప్రజలపై నింద మోపుతుందని, వారి పాలనలోని లోపాల వల్లే ఇంత జరుగుతున్నా.. అంగీకరించడం లేదని విమర్శించారు.

Rahul Gandhi tweet
రాహుల్​ గాంధీ ట్వీట్​

ఇంకెన్ని యాక్ట్​ ఆఫ్​ మోదీలను భరించాలో?

ప్రజలు బాధ్యత లేకుండా ప్రవర్తించడం వల్లే దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని హర్షవర్ధన్​ లోక్​సభలో అన్నారు. దీనికి సంబంధించిన మీడియా కథనాలను ట్యాగ్​ చేశారు రాహుల్​. ముందుచూపు లేని, దురంహకారపూరితమైన మోదీ సర్కారు దేవుడిపై, ప్రజలపై నిందలేస్తుందే కానీ.. వారి లోపాలను అంగీకరించదంటూ ట్వీట్ చేశారు. దేశం.. ఇంకెన్ని యాక్ట్‌ ఆఫ్ మోదీలను భరించాలని విరుచుకుపడ్డారు రాహుల్​.

ఇదీ చదవండి: రఫేల్​ దళంలోకి త్వరలో మహిళా పైలెట్​

Last Updated : Sep 21, 2020, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.