ఉత్తర్ప్రదేశ్ లఖీంపుర్ ఖేరీలో ఇటీవల అదృశ్యమైన ఓ యువతి.. చెరకు తోటలో మృతదేహమై కనిపించింది. ఇంటి ఆవరణ నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. ఇలా శవంగా మారడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ జరిగింది..
పస్గావా ప్రాంతానికి చెందిన ఓ యువతి శుక్రవారం అదృశ్యమైంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆమెకోసం వెతకడం ప్రారంభించారు. స్థానిక పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. ఇంతలో ఆదివారం సాయంత్రం ఓ చెరకు తోటలో ఆమె శవం లభ్యమైంది.
యువతి మెడపై తీవ్ర గాయాలను గుర్తించిన పోలీసులు.. హత్యకు గురైనట్టుగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించారు.
ఈ పూర్తి వ్యవహారంపై స్థానిక ఏఎస్పీ ఏకే సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఆకులతో అద్భుతాలు- కేరళ యువతి కళకు ఫిదా