ETV Bharat / bharat

పాక్​కు భారత్​ దీటైన జవాబు.. ఆర్మీ పోస్టులు ధ్వంసం - ఎల్​ఓసీ

నియంత్రణ రేఖ వెంబడి రాజౌరీ సెక్టార్​లో పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు భారత భద్రతా దళాలు ప్రకటించాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్న దాయాది దేశానికి సరైన గుణపాఠం నేర్పినట్లు స్పష్టం చేశాయి.

Indian Army causes heavy damage to Pakistan Army posts across LoC
ఎల్​ఓసీ వెంబడి పాక్​ ఆర్మీ పోస్టులకు భారీ నష్టం
author img

By

Published : Jun 12, 2020, 9:44 AM IST

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ నియంత్రణ రేఖ (ఎల్​ఓసీ) వెంబడి పదేపదే కాల్పులకు పాల్పడుతున్న పాకిస్థాన్​కు దీటైన సమాధానం ఇచ్చినట్లు భారత భద్రతా దళాలు స్పష్టం చేశాయి. రాజౌరీ సెక్టార్​లో పాక్​ ఆర్మీ పోస్టులను కోలుకోలేని దెబ్బతీసినట్లు వెల్లడించాయి.

పాకిస్థాన్​ గత కొన్నేళ్లుగా నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతోంది. ముఖ్యంగా సరిహద్దు గ్రామాల ప్రజలను లక్ష్యంగా చేసుకుంటోంది. అయితే వీటిని భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతూనే ఉన్నాయి.

ఓ జవాన్ మృతి

బుధవారం రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య... సరిహద్దుల్లో పలుచోట్ల పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. రాజౌరి, పూంఛ్ జిల్లాల్లోని నౌషెరా, బాలాకోట్ సెక్టార్లలోని నియంత్రణ రేఖ(ఎల్​ఓసీ) వెంబడి గ్రామాలు, సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకొని మోర్టార్లను ప్రయోగించారు.

ఈ ఘటనలో భారత జవాను మృతి చెందాడు. ఓ పౌరుడికి తీవ్ర గాయాలయ్యాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని పశువులు కూడా మృతి చెందాయి.

కొద్దిరోజులుగా జమ్ముకశ్మీర్​లోని పలు ప్రాంతాల్లో నక్కి ఉన్న ఉగ్రవాదులను భారత సైన్యం హతమారుస్తుండగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతుండడం గమనార్హం.

ఇదీ చూడండి: ప్రైవేటు ఉద్యోగుల వేతనాలపై నేడు సుప్రీం కీలక తీర్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.