ETV Bharat / bharat

అన్​లాక్​-5: సినిమా హాళ్లు తెరిచేందుకు కేంద్రం అనుమతి

govt-of-india-issues-new-guidelines-for-re-opening-cinema-halls
సినిమా హాళ్లకు అనుమతి
author img

By

Published : Sep 30, 2020, 8:08 PM IST

Updated : Sep 30, 2020, 8:42 PM IST

20:25 September 30

15న థియేటర్లు ఓపెన్​..

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. సెప్టెంబర్‌ 30తో అన్‌లాక్‌ 4.0 గడువు ముగియనుండగా.. మరిన్ని మినహాయింపులతో కూడిన నూతన మార్గదర్శకాలను ఇవాళ విడుదల చేసింది. కంటైన్​మెంట్‌ జోన్ల వెలుపల ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు/ మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే 50 శాతం సీట్ల సామర్థ్యంతోనే వాటిని తెరిచేందుకు అనుమతిని ఇచ్చింది. 

అక్టోబర్‌ 15 నుంచి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు తెరిచేందుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. అలాగే, క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్‌ పూల్స్‌ తెరిచే వెసులుబాటు కల్పించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో అక్టోబర్‌ 31 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

10 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, 65 ఏళ్ల పైబడిన వారు తప్పక ఇంట్లోనే ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. 

అక్టోబర్‌ 15 నుంచి స్కూళ్లు తెరిచే అంశంపై నిర్ణయం తీసుకునే వెసులుబాటును.. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది. ఈ అంశంలో విద్యాసంస్థలు, పాఠశాలల యాజమాన్యాలతో చర్చల తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం. అంతేకాకుండా ఈ అంశంలో పలు సూచనలు చేసింది.

  • ఆన్‌లైన్‌ బోధన విధానం, దూరవిద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం
  • తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితోనే పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశం
  • పాఠశాలల పునఃప్రారంభంపై రాష్ట్రాలు భద్రతా మార్గదర్శకాలు రూపొందించాలి
  • పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుబంధంగా భద్రతా నిబంధనలు అమలు
  • పునఃప్రారంభమయ్యే పాఠశాలలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్ణయం
  • కళాశాలల పునఃప్రారంభంపై ఉన్నత విద్యావిభాగం నిర్ణయాలు తీసుకోవచ్చు

20:14 September 30

కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్-5 మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాలల పునఃప్రారంభానికి వెసులుబాటు కల్పించింది. అక్టోబర్‌ 15 తర్వాత ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి దశలవారీగా పాఠశాలల పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చింది. 

  • సంబంధిత విద్యాసంస్థలు, పాఠశాలల యాజమాన్యాలతో చర్చల తర్వాత నిర్ణయం

  • ఆన్‌లైన తరగతులకు విద్యార్థులు మొగ్గు చూపితే పాఠశాలలు అనుమతించవచ్చు

  • పాఠశాలల పునఃప్రారంభంపై ఆయా రాష్ఠ్రాలు భద్రతా మార్గదర్శకాలు రూపొందించాలి
  • కేంద్ర పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుబంధంగా భద్రతా నిబంధనలు
  • పునఃప్రారంభించే పాఠశాలలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్ణయం

సినిమా హాళ్లకు అనుమతి..

  • అక్టోబర్‌ 31 వరకు కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగింపు
  • అక్టోబర్​ 15 నుంచి 50 శాతం సీట్ల సామర్థ్యంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతి
  • క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే స్విమ్మింగ్‌ పూల్‌లకు అనుమతి

20:11 September 30

  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాలల పునఃప్రారంభానికి వెసులుబాటు
  • అక్టోబర్‌ 15 తర్వాత ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి దశలవారీగా పాఠశాలల పునఃప్రారంభం

20:05 September 30

అన్​లాక్​-5: సినిమా హాళ్లు తెరిచేందుకు కేంద్రం అనుమతి

అన్‌లాక్-5 నిబంధనలు విడుదల చేసిన కేంద్ర హోంశాఖ

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాలల పునఃప్రారంభానికి వెసులుబాటు

అక్టోబర్‌ 31 వరకు కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగింపు

అక్టోబర్​ 15 నుంచి.. 50 శాతం సీట్ల సామర్థ్యంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతి

క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే స్విమ్మింగ్‌ పూల్‌లకు అనుమతి

Last Updated : Sep 30, 2020, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.