ETV Bharat / bharat

సర్కార్​ నిర్ణయంతో ఇక మన ఇంటికే ఔషధాలు!

ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువుల లభ్యత విషయంలో ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది కేంద్రం. వలస కూలీలకు ఆహారం, ఆశ్రయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఆరోగ్య సంక్షోభ సమయంలో ప్రజల ఇంటి వద్దకు వెళ్లి ఔషధాలు అందించేందుకు మెడికల్ రిటైలర్లకు అనుమతి ఇచ్చింది.

Centre asks states to arrange food, shelter for migrant workers
సర్కార్​ నిర్ణయంతో ఇక మన ఇంటికే ఔషధాలు!
author img

By

Published : Mar 27, 2020, 8:39 AM IST

సర్కార్​ నిర్ణయంతో ఇక మన ఇంటికే ఔషధాలు!

లాక్​డౌన్​ సమయంలో నిత్యావసర వస్తువుల లభ్యతపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్​ (ఎస్​ఓపీ)ను జారీ చేసింది. ప్రజలకు వస్తు, సేవలు అందించే విషయంలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించింది.

చిన్న రిటైల్ దుకాణాలు, పెద్ద వ్యవస్థీకృత రిటైల్​ స్టోర్​, ఈ-కామర్స్ కంపెనీ సేవల్లో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఫుడ్​ డెలివరీ సేవలు అందించే రెస్టారెంట్లు, నిత్యఅవసర పదార్థాల నిల్వలకు ఉపయోగించే గిడ్డంగులకు కూడా అనుమతి ఇవ్వాలని సూచించింది. అలాగే నిత్యవసర సరకుల రవాణా చేసే డ్రైవర్లు, లోడర్లకు, రవాణాదారులకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది.

వలస కూలీలను ఆదుకోండి

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రకటించిన 21 రోజుల లాక్​డౌన్​ కారణంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వీరికి ఆహారం, ఆశ్రయం కల్పించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. హాస్టళ్లలో ఉన్న విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా.. ప్రస్తుతం ఉంటున్న చోటే వారుండేలా చూడాలని స్పష్టం చేసింది.

పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తాము పనిచేస్తున్న ప్రాంతాలను విడిచిపెట్టి... వందలాది కిలోమీటర్ల దూరంలోని తమ స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తూ, మార్గమధ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా సూచనలు చేసింది.

ఇంటికే ఔషధాలు

ప్రస్తుతం కరోనా వల్ల దేశంలో ఏర్పడిన ఆరోగ్య సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నడుంబిగించింది. మెడికల్ రిటైలర్లు.. ప్రజలకు అవసరమైన ఔషధాలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వు అధికారిక గెజిట్​లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

సీఆర్​పీఎఫ్​ వితరణ

కరోనా నియంత్రణ కోసం సీఆర్​పీఎఫ్..​ తన దళాల ఒక రోజు వేతనం నుంచి రూ.38.81 కోట్లను ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధికి అందించింది.

రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్​?

కరోనా నియంత్రణ చర్యలపై చర్చించడానికి గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో... రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ త్వరలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఔషధ పరిశ్రమల ప్రతినిధులు, వార్తా పత్రికల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి కూడా రంగంలోకి దిగారు.

ఇదీ చూడండి: కరోనా కేసులు పెరిగినా.. వ్యాప్తి రేటులో తగ్గుదల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.