ETV Bharat / bharat

'భాజపా ఉచిత టీకా వాగ్దానం చట్టబద్ధమే' - కరోనా టీకా ఉచిత వాగ్దానం

బిహార్​ ఎన్నికల మేనిఫెస్టోలో కరోనా వ్యాక్సిన్​ను ఉచితంగా ఇస్తామని భాజపా హామీ ఇవ్వడం చట్టబద్ధంగా తప్పుకాదన్నారు ఎన్నికల సంఘం మాజీ అధికారులు. రాజకీయ పార్టీలు ఎలాంటి వాగ్దానాలైనా చేయవచ్చని పేర్కొన్నారు. అయితే వాటికి ఎంత బడ్జెట్ అవసరమో కూడా పార్టీలు చెప్పాలని సుప్రీంకోర్టు గతంలో సూచించిన విషయాన్ని గుర్తు చేశారు.

Free vaccine promise cannot be legally faulted: Former poll panel chiefs
'భాజపా ఉచిత టీకా వాగ్దానం చట్టబద్ధమే'
author img

By

Published : Oct 23, 2020, 7:38 PM IST

కరోనా వ్యాక్సిన్​ను ప్రజలకు ఉచితంగా అందిస్తామని బిహార్​ ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా హామీ ఇవ్వడాన్ని వివిధ రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఎన్నికల సంఘం మాజీ అధికారులు స్పందించారు. భాజపా హామీ చట్టబద్ధంగా తప్పుకాదన్నారు.

అయితే భాజపా ఎన్నికల హామీ నైతికత ప్రశ్నను లెవనెత్తుతోందన్నారు ఎస్​వై ఖురేషీ. ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తిగా నైతిక విలువలకు సంబంధించిందని చెప్పారు. 2010 నుంచి 2012 మధ్య కాలంలో పోల్​ ప్యానెల్ చీఫ్​గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఎలాంటి హామీలైనా ఇవ్వొచ్చని మరో మాజీ అధికారి ఓపీ రావత్​ అన్నారు. అయితే ఆ హామీని నెరవేర్చడానికి ఎంత బడ్జెట్​ అవుతుందనే విషయాన్ని కూడా ఆయా పార్టీలు మేనిఫెస్టోలో పొందుపర్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2018, డిసెంబర్​లో​ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి బాధ్యతలకు వీడ్కోలు పలికారు రావత్.

రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను ఎప్పుడు విడుదల చేయాలనే విషయమూ ముఖ్యమేనని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో మాజీ అధికారి అన్నారు. ఎన్నికలు దగ్గరపడ్డప్పుడు కాకుండా అంతకు చాలా రోజుల ముందే పార్టీలు మేనిఫెస్టోను ప్రకటించే విధానాన్ని ఎన్నికల సంఘం అమలు చేయలేకపోతోందని అభిప్రాయపడ్డారు.

పార్టీలు ఇచ్చిన వాగ్దానాలు అనుసరించాల్సిన విధానానికి సంబంధించి ఎన్నికల సంస్కరణల్లో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ప్రతిపాదించిన విషయాలను మాజీ ఎన్నికల అధికారి ప్రస్తావించారు.

ఇదీ చూడండి: భాజపా 'టీకా' ప్రకటనపై విపక్షాల రగడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.