నాగాలాండ్ మాజీ గవర్నర్, సీబీఐ మాజీ డైరెక్టర్ అశ్వనీకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. సిమ్లాలోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణం చెందారు. గతంలో ఆయన నాగాలాండ్, మణిపూర్ గవర్నర్‌గా, హిమాచల్ ప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. గతకొంత కాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో ఉన్నారని, ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు, ఇందిరా గాంధీ వైద్య కళాశాల- ఆస్పత్రి (ఐజీఎంసీ) వైద్యులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అశ్వనీకుమార్ మరణాన్ని సిమ్లా ఎస్పీ మోహిత్ చావ్లా ధ్రువీకరించారు. ఆయన మరణం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎస్పీ తెలిపారు. ఎంతోమంది పోలీస్ అధికారులకు ఆయన ఆదర్శప్రాయులుగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు.
హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్ 1973 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్న అశ్వనీకుమార్ 2006 ఆగస్టు నుంచి 2008 జులై వరకు అదే రాష్ట్రానికి డీజీపీగా పనిచేశారు. అనంతరం 2008 ఆగస్టు నుంచి 2010 నవంబర్ వరకు రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్‌గా సేవలందించారు. 2013- 2014 మధ్య కాలంలో నాగాలాండ్‌కు గవర్నర్‌గా పనిచేశారు. అదే సమయంలో మణిపూర్‌కు కూడా గవర్నర్‌గా సేవలందించారు.
ఇదీ చూడండి: మంచి చెప్పినా వినని ముగ్గురు ముష్కరులు హతం