ETV Bharat / bharat

కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డ తొలి బాధితురాలు - kerala corona victims updates

దేశంలో తొలి కరోనా కేసు బాధితురాలు ప్రాణాపాయం నుంచి బయటపడింది. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన వైద్యులు.. ఆమెకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్​గా వచ్చినట్లు వెల్లడించారు.

first corona case victim in india is safe
కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డ తొలి బాధితురాలు
author img

By

Published : Feb 10, 2020, 8:31 PM IST

Updated : Feb 29, 2020, 9:56 PM IST

కరోనా వైరస్ నుంచి దేశంలో తొలి కరోనా బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. ఈ మేరకు కేరళ వైద్యాధికారులు ప్రకటించారు. కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన విద్యార్థినికి చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ సోకింది. స్వదేశానికి వచ్చిన ఆమెకు కరోనా ఉందని తేలింది. అప్పటి నుంచి ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన వైద్యులు.. ఆమెకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్‌ నెగెటివ్‌గా వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ప్రకటించారు. చివరిగా మరోసారి పరీక్షించి, ఆమెను ఇంటికి పంపించబోతున్నట్లు వెల్లడించారు.

ఇప్పటి వరకు కేరళలో ముగ్గురికి కరోనా వైరస్ సోకగా.. తాజాగా ఒకరు వైరస్ నుంచి బయటపడ్డారు. మరో ఇద్దరిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బాణాలు వేయడంలో 'దేవసేన'ను మించిన నైపుణ్యం వీరిది!

Intro:Body:Conclusion:
Last Updated : Feb 29, 2020, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.