ETV Bharat / bharat

నేటి నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం - passenger flights to resume

లాక్​డౌన్​ తర్వాత ఈరోజు(మే 25) నుంచే దేశీయ విమాన సర్వీసులు పునః ప్రారంభంకానున్నాయి. ముంబయి, హైదరాబాద్​ నుంచి పరిమిత స్థాయిలో విమానాలు నడపనున్నారు అధికారులు. పశ్చిమ బంగా, ఆంధ్రప్రదేశ్​లో మాత్రం విమానయానానికి మరిన్ని రోజులు పట్టనుంది. ఈ క్రమంలోనే ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలను ప్రకటించింది కేంద్రం.

Domestic passenger flights to resume Monday amid confusion as several states set their own rules
నేటి నుంచి దేశీయ విమాన సర్వీలు ప్రారంభం!
author img

By

Published : May 25, 2020, 5:30 AM IST

Updated : May 25, 2020, 7:56 AM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ సడలింపుల్లో భాగంగా నేటి నుంచి దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే విమానాశ్రయానికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను ఇదివరకే ఎయిర్​పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రకటించింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ చేసింది.

రెండు నెలల తర్వాత దేశీయ విమానయానాలకు కేంద్రం అనుమతులివ్వడంపై వైరస్​ ప్రభావిత రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. కరోనా పరిస్థితుల వేళ వచ్చే ప్రయాణికులతో ఇబ్బందులు వస్తాయని ఆయా రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలోనే పరిమిత స్థాయిలో ముంబయి నుంచి రోజుకు 50 విమానాలు, హైదరాబాద్ నుంచి 30 విమానాలు మాత్రమే నడపనున్నట్లు పౌరవిమానయాన శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో.. కాస్త ఆలస్యంగా మే 26 నుంచి విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. బంగాల్​లోని కోల్​కతా, బాగ్డోగ్రాలో మే 28 నుంచి దేశీయ సేవలను ప్రారంభించనున్నారు.

క్వారంటైన్​ తప్పని సరి...

దిల్లీ, గుజరాత్​, తమిళనాడు సహా వైరస్​ అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను ఏడురోజుల పాటు సంస్థాగత క్వారంటైన్​లో ఉంచనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. అసోం, ఆంధ్రప్రదేశ్​, పంజాబ్​, కేరళ తదితర రాష్ట్రాలూ ఇదే తరహా నిర్ణయాన్ని ప్రకటించాయి.

విమానాశ్రయాల్లో అనుసరించాల్సిన ప్రామాణిక నిబంధనలు:

ఆరోగ్యసేతు తప్పనిసరి:

  • ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది, ఎయిర్‌పోర్టు సిబ్బంది.. విమానాశ్రయాలకు వెళ్లేందుకుగాను స్థానిక ప్రభుత్వాలు ప్రజా రవాణా వ్యవస్థ, ప్రైవేటు టాక్సీలను అనుమతించాలి.
  • విమానాశ్రయంలోకి ప్రవేశించే మార్గం, కార్‌ పార్కింగ్‌ ప్రాంతాలన్నింటి వద్ద సీఐఎస్‌ఎఫ్​, పోలీసు నిఘాను కట్టుదిట్టం చేయాలి.
  • ప్రయాణికులు నిర్దేశించిన సమయం కంటే.. రెండు గంటలు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలి. విమాన ప్రయాణ సమయానికి నాలుగు గంటల ముందు వచ్చిన వారికి మాత్రమే టెర్మినల్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
  • ప్రయాణికులంతా.. తప్పని సరిగా ఆరోగ్య సేతు యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆరోగ్య సేతు యాప్‌లో గ్రీన్‌మార్క్‌ చూపితేనే ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ లోపలికి అనుమతిస్తారు.
  • 14 ఏళ్ల లోపు పిల్లలకు ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరి కాదు.

థర్మల్​ స్క్రీనింగ్​ పక్కా:

  • విమానాశ్రయంలోకి వచ్చే ప్రతి ప్రయాణికుడు.. స్క్రీనింగ్‌ జోన్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవాల్సిందే. అందుకు తగిన విధంగా విమానాశ్రయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలి.
  • థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసేందుకు ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లు శిక్షిత సిబ్బందిని నియమించాలి.
  • విమానాశ్రయాల్లో ట్రాలీల వినియోగం నిషేధం. తప్పని సరి అయితేనే విమానాశ్రయ సిబ్బంది వాటిని ఇవ్వాల్సి ఉంటుంది.
  • టెర్మినల్‌లోకి ప్రవేశించే ముందే ప్రయాణికుల బ్యాగేజిని శానిటైజేషన్‌ చేయాలి.
  • ప్రవేశద్వారాల వద్ద ఎక్కువ మంది ప్రయాణికులు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా ప్రతి ప్రవేశ ద్వారం వద్ద తగిన మార్కింగ్‌ చేయాలి.
  • మ్యాట్‌లు, కార్పెట్లను సోడియం హైపోక్లోరైట్‌ సొల్యూషన్‌తో పూర్తి స్థాయిలో శుభ్రపరచాలి.

భౌతిక దూరంలో ప్రయాణికులు:

  • ప్రయాణికులకు అనువుగా ఉండేలా.. టికెట్ తనిఖీ ప్రదేశాలు, భద్రతా తనిఖీ, చెక్‌ఇన్‌ కౌంటర్లు వంటి వాటి చోట ప్రత్యేకంగా రూపొందించిన గాజు క్యాబిన్‌లు ఏర్పాటు చేయాలి లేదా అక్కడ ఉండే సిబ్బంది పారదర్శక ఫేస్‌ షీల్డ్‌ ధరించాలి.
  • విమానాశ్రయాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సీఐఎస్‌ఎఫ్‌ తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేయాలి.
  • ప్రయాణికులకు ప్రత్యేక సేవలు అందించే సిబ్బంది తప్పని సరిగా.. వ్యక్తిగత భద్రతా చర్యలు తీసుకోవాలి. వీల్‌చైర్లను ముందుగానే శానిటైజ్‌ చేయాలి.
  • భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు గుర్తు చేసేందుకుగాను.. ప్రకటనలు చేస్తూ ఉండాలి.
  • మూత్రశాలలు, ఎక్స్‌రే యంత్రాలు, బ్యాగేజి బెల్టుల వద్ద తగినంత సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  • ప్రయాణికులు అనుసరించాల్సిన అంశాలను నోటీస్​ బోర్డులపై అతికించాలి.
  • ప్రయాణికులు కుర్చునేందుకు అనువుగా భౌతిక దూరంతో కుర్చీలు ఏర్పాట్లు చేయాలి.

అందుబాటులో శానిటైజర్లు:

  • విమానయాన సంస్థలు కూడా చెక్‌ఇన్‌ కౌంటర్ల వద్ద రద్దీ లేకుండా చూసేందుకు తగిన సిబ్బందిని నియమించాలి.
  • ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది హాండ్‌ శానిటైజర్లు, వ్యక్తిగత భద్రత వ్యవస్థలను కలిగి ఉండాలి.
  • ఎయిర్‌పోర్టు మొత్తం ప్రతి ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తూ ఉండాలి.
  • ఎయిర్‌పోర్టు సిబ్బంది అంతర్గతంగా వినియోగించే వాహనాలను శానిటైజ్ చేసిన తర్వాతే వినియోగించాలి.
  • అవకాశం ఉన్నంత తక్కువగా సెంట్రలైజ్డ్‌ ఏసీ వినియోగించాలి.
  • ఎక్కడికక్కడ హ్యాండ్‌ శానిటైజర్లు ఏర్పాటు చేయాలి.
  • అనుమతించిన రసాయనాలనే వైరస్ నివారణకు వినియోగించాలి.
  • జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్న సిబ్బంది విధులకు దూరంగా ఉండాలి.
  • ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో పని చేసే సిబ్బంది ఎక్కువ మందిని ఒకచోట గుమిగూడకుండా నియంత్రించాలి.

పార్శిళ్లకే అనుమతి:

  • ఎయిర్‌పోర్టులలో ఆహార దుకాణాలతోపాటు అన్ని రకాల వ్యాపార సముదాయాలు తెరవచ్చు. కానీ హోటళ్లు, పుడ్‌ ప్లాజాల వద్ద ఆహారం తీసుకుని వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇవ్వాలి.
  • విమానం లోపలికి పంపే సమయంలో కూడా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఒకవేళ టెర్మినల్‌లో ఎవరైనా కరోనా సోకిన రోగిని గుర్తిస్తే.. వెంటనే ఆ ప్రాంతం అంతా వ్యాధినిరోధక రసాయనాలతో శుభ్రం చేయాలి. తగినంత జాగ్రత్తలు తీసుకుని రోగిని నిర్దేశిత ప్రాంతం నుంచి తరలించాలి.
  • గమ్యస్థానం చేరుకున్న తర్వాత ప్రయాణికులు విమానం నుంచి ఎలా దిగాలో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది తగిన సూచనలు ఇవ్వాలి.
  • వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలు, సలహాలను ఎయిర్‌పోర్టులో ఎక్కడికక్కడ పోస్టర్లు, డిస్‌ప్లే బోర్డుల రూపంలో ప్రదర్శించాలి.
  • ప్రయాణికులు, సిబ్బంది మధ్య సంభాషణ జరిగే అవకాశం ఉన్న ప్రతి చోట గ్లాస్‌ షీల్డ్‌ ఏర్పాటు చేయాలి.
  • బ్యాగేజి తీసుకునే చోట తప్పనిసరిగా భౌతిక దూరం పాటించే మార్కింగ్‌లు ఉండాలి.
  • విమానం నుంచి దించిన ప్రతి బ్యాగ్‌ను శానిటైజ్‌ చేసిన తరువాతే ప్రయాణికులు తీసుకునేలా ఏర్పాటు చేయాలి.

Last Updated : May 25, 2020, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.