ETV Bharat / bharat

ఇంట్లో చేసిన మాస్కులు కరోనా నుంచి రక్షిస్తాయా? - కరోనా వైరస్ జాగ్రత్తలు

కరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా మాస్కులకు డిమాండ్ పెరిగింది. వీటి లభ్యత కూడా తగ్గింది. ఈ పరిస్థితుల్లో చాలా మంది ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులు వినియోగిస్తున్నారు. వీటి వల్ల వైరస్ సంక్రమణను నివారించగలమా? ఇవి ఎంతమేరకు పనిచేస్తాయి?

mask
మాస్కు
author img

By

Published : Apr 5, 2020, 7:13 AM IST

Updated : Apr 5, 2020, 11:51 AM IST

ఇతరుల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖానికి మాస్కులు ధరించాలని కొంతమంది నిపుణులు ప్రజలకు సలహా ఇస్తున్నారు. ప్రజలు కూడా విరివిగా ముసుగులను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రక్షణ పరికరాల నిల్వలు నిండుకుంటున్నాయి. వైద్య సిబ్బందికి మాస్కుల లభ్యత తగ్గుతోంది.

వైరస్ సోకినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు శ్వాసకోశ బిందువులు బయటకు వస్తాయి. వీటి ద్వారా ఎదుటివారికి వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మాస్కులు, ఇతర రక్షణ పరికరాలు వైరస్ వ్యాప్తి జరగకుండా నియంత్రిస్తాయి. అయితే మాస్కులు ఎవరు వాడాలి.. ఎలాంటి మాస్కులు వాడాలన్న విషయంలో అనేక వాదనలు వినిపిస్తున్నాయి.

ఇవి సరిపోతాయి..

ప్రతి ఒక్కరు ధరిస్తేనే మాస్కుల వల్ల ఫలితం ఉంటుందని బర్మింగ్​హమ్​ విశ్వవిద్యాలయ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ కేకే చెంగ్ అంటున్నారు. అయితే ఇందుకు సాధారణ మాస్కులు సరిపోతాయని చెబుతున్నారు. ఎందుకంటే.. ఓ టిష్యూ పేపర్ కూడా ఈ తుంపర్లను నిలుపుదల చేయగలవని తెలిపారు. మరికొందరు నిపుణులు ఇదే తరహా అభిప్రాయం వ్యక్తంచేశారు.

"ఇంట్లో తయారుచేసిన ముసుగులు వ్యాధి సంక్రమణను తగ్గిస్తాయో లేదో స్పష్టంగా చెప్పలేం. ఈ అంశంపై చాలా తక్కువ శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. అయినప్పటికీ ఇవీ మంచి ఫలితాల్నే ఇస్తాయి."

- బెంజమిన్ కౌలింగ్, అంటువ్యాధుల నిపుణుడు

చివరి ప్రయత్నం..

ఇన్ ఫ్లుయెంజా మహమ్మారి సమయంలో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం మాస్కులపై 2013లో ఓ అధ్యయనం చేసింది. టీ-షర్టుల నుంచి మాస్కులను తయారు చేసే పనిని వలంటీర్లకు అప్పగించింది. ఈ అధ్యయనం ద్వారా ఇంట్లో తయారు చేసిన మాస్కులు సంక్రమణను తగ్గిస్తాయని.. కానీ ప్రమాదాన్ని నివారించలేవని గుర్తించింది.

"సోకిన వ్యక్తుల నుంచి బిందువుల ప్రసారాన్ని నివారించడానికి ఇంట్లో తయారుచేసిన మాస్కులు చివరి ప్రయత్నంగా మాత్రమే పరిగణించాలని మా పరిశోధనలు సూచిస్తున్నాయి. ఏవీ లేని సమయంలో ఇవే మనకు రక్షణ కల్పిస్తాయి."

-కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అధ్యయనం

మాస్కులు వాడాలని సిఫారసు చేసే వైద్యులు కూడా చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించటం తప్పనిసరి అని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఇవే కీలకమని చెబుతున్నారు.

పాశ్చాత్య దేశాల్లో..

కరోనా విజృంభణ నేపథ్యంలో అనేక పాశ్చాత్య దేశాలు మాస్కులను విరివిరిగా వాడాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అనారోగ్యంతో ఉన్నవారు, వైద్య సిబ్బంది మాత్రమే మాస్కులు ధరించాలని సూచిస్తోంది.

అయితే ఎక్కువగా మాస్కులను వినియోగించే ఆసియాలో ఈ ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అమెరికా, ఐరోపాలో ప్రజలు మాస్కులు ధరించకపోవటమే అతిపెద్ద తప్పని చైనా ఆరోగ్య నిపుణుడు గావో ఫూ అభిప్రాయపడ్డారు.

పాశ్చాత్య సంస్కృతిలో మాస్కుల వినియోగం అంతగా లేదని.. అందరూ వాడటం మొదలు పెడితే వైద్యులకు కొరత ఏర్పడుతుందని ఆ దేశాలు భావిస్తున్నాయని కేకే చెంగ్ అన్నారు. మహమ్మారి భారీగా విజృంభిస్తోన్న ఐరోపా దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వినియోగించాలని అక్కడి ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

మెడికల్ మాస్కులు లేకున్నా సాధారణ ముసుగులు ధరించవచ్చని పలువురు చెబుతున్నారు. ఆన్ లైన్ ట్యుటోరియల్స్ ద్వారా వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: మాస్కు​ ఎవరు వాడాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

Last Updated : Apr 5, 2020, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.