ETV Bharat / bharat

భారత్​లో మరో ఆరుగురికి కరోనా!

భారత్​లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. వైరస్​ సోకిన ఇద్దరిని సోమవారం అధికారులు గుర్తించారు. తాజాగా మరో ఆరుగురికి వైరస్​ లక్షణాలు అధికంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓవైపు బాధితులకు చికిత్స అందిస్తూనే.. వైరస్​ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.

coronavirus-six-cases-with-high-viral-load-detected-in-agra
మరో ఆరుగురు భారతీయులకు కరోనా!
author img

By

Published : Mar 3, 2020, 5:55 PM IST

Updated : Mar 3, 2020, 10:34 PM IST

భారత్​లో మరో ఆరుగురికి కరోనా!

భారత్​లో మరో ఆరుగురికి కరోనా వైరస్​ లక్షణాలు అధికంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరందరినీ ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రాలో గుర్తించినట్టు స్పష్టం చేసింది.

దిల్లీ నుంచి ఆగ్రాకు...

ఇద్దరు భారతీయులకు వైరస్​ సోకినట్టు సోమవారం నిర్ధరణ అయ్యింది. వీరిలో 45ఏళ్ల దిల్లీవాసి ఒకరు. ఆయన ఇటీవలే ఆగ్రాను సందర్శించారు. ఆ వ్యక్తి బంధువులే ఈ ఆరుగురు ఆగ్రావాసులు. ప్రస్తుతం వీరిని అధికారులు నిర్బంధించారు. దిల్లీలోని సఫ్దార్​జంగ్​ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో ఈ ఆరుగురిని కలిసిన వారి కోసం 'ఇంటిగ్రేటెడ్​ డిసీజ్​ సర్వైలెన్స్​ ప్రోగ్రామ్​'(ఐడీఎస్​పీ) సహాయంతో అన్వేషిస్తున్నారు అధికారులు .

కరోనా బారినపడ్డ దిల్లీవాసిని సఫ్దార్​జంగ్​ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ​ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను నిత్యం అప్రమత్తంగా ఉండమని సూచించారు అధికారులు. బాధితుడి కుమార్తె చదివే పాఠశాల సహా మరో విద్యాసంస్థకు సెలవులు ఇచ్చారు.

ఆగ్రాలో సర్వం అప్రమత్తం...

కరోనాను గుర్తించేందుకు ఆగ్రాలో విస్త్రతంగా పరీక్షలు జరుగుతున్నాయి. ఇటలీ, చైనా, ఇరాన్​ నుంచి వచ్చిన సందర్శకులకు స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహించడం కోసం హోటళ్లు, పర్యటక కేంద్రాల నుంచి వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. జైపుర్​లోని ఓ ఇటలీవాసికి వైరస్​ సోకినట్టు నిర్ధరణ కావడం వల్ల ఈ చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల కోసం వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచారు.

నూతన మార్గదర్శకాలు..

దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ఆరోగ్యశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటలీ, ఇరాన్​, దక్షిణ కొరియా, జపాన్​ దేశస్థులకు మార్చి 3 నాటికి ఆందజేసిన సాధారణ, ఈ-వీసాలను రద్దు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో భారత్​కు రావాలనుకునే వారు.. ఆయా దేశాల్లోని భారత రాయబార కేంద్రాలను సంప్రదించాలని స్పష్టం చేసింది.

చైనా దేశస్థుల వీసాలపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఔషధాలపై ప్రభావం...

కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఔషధాల ఎగుమతిపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. చైనా నుంచి ఔషధ ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులు ఉన్నందున.. రెండు డజనుకుపైగా మందులు, ఫార్ములేషన్ల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ జాబితాలో పారాసెట్మాల్‌, టినిడాజోల్, మెట్రోనిడాజోల్, విటమిన్‌ బి1, బి6, బి12, ప్రొజెస్టెరాన్ సహా అనేక ఔషధాలు, ఫార్ములాలు ఉన్నాయి.

తెలంగాణ వ్యక్తిని కలిసిన వారు...

దిల్లీ వ్యక్తితో పాటు తెలంగాణవాసికీ వైరస్​ సోకినట్టు సోమవారం అధికారులు గుర్తించారు. దుబాయి వెళ్లిన అతడు.. బెంగళూరు నుంచి హైదరాబాద్​కు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్​కు చెందిన వ్యక్తితో కలిసిన వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు తెలిపింది.

ఇదీ చూడండి:- దేశంలో మరొకరికి కరోనా- 6కు చేరిన బాధితులు

Last Updated : Mar 3, 2020, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.