దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 45,149 కేసులు నమోదయ్యాయి. మరో 480మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 79 లక్షలు దాటాయి.
అయితే ఒక్కరోజే 59,105 మంది కోలుకోవడం వల్ల మొత్తం రికవరీల సంఖ్య 71,37,229కి చేరింది. భారత్లో రికవరీ రేటు 90 శాతం దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరణాల రేటు 1.50 శాతానికి పడిపోయింది.
పరీక్షలు ఇలా..
ఒక్కరోజులో 9,39,309 కొవిడ్ టెస్టులు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య 10,34,62,778కు చేరింది.