భారత్లో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజూ దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో మరో 9987 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 266 మంది మరణించారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 3169 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 88 వేలు దాటింది. గుజరాత్లో 1280 మంది, మధ్యప్రదేశ్లో 414, బంగాల్లో 405 మంది మరణించారు.