ETV Bharat / bharat

మహారాష్ట్రకు కరోనా గండం- నాగ్​పుర్​లో 144 సెక్షన్​ - Covid-19

భారత్​లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 114మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలతో సహా అనేక కంపెనీలను మూసివేశారు. వైరస్​ను కట్టడిచేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి.

Corona cases in India rise to 114
భారత్​లో 114 కేసులు
author img

By

Published : Mar 17, 2020, 5:21 AM IST

Updated : Mar 17, 2020, 6:13 AM IST

కరోనా వైరస్​ కేసుల సంఖ్య భారత్​లో 114కి చేరింది. ఈ మహమ్మారిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల ఉద్యోగులను ఇంటినుంచే పని చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆయా సంస్థలకు సూచిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.

మహారాష్ట్రలో ఎక్కువగా..

ముంబయి మెట్రోపాలిటన్​ ప్రాంతంలో.. కొత్తగా మరో ఐదుగురికి కరోనా పాజిటివ్​ రావడం వల్ల మొత్తం కేసుల సంఖ్య 14కు పెరిగింది. నాసిక్​లో మరో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇద్దరు వ్యక్తుల్లో వైరస్​ లక్షణాలు కనిపించినందున వారిని జిల్లా ప్రభుత్వ​ ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.

జమ్ముకశ్మీర్​లో తాజాగా ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలింది. ఫలితంగా కశ్మీర్​లో మొత్తం కేసుల సంఖ్య మూడుకు చేరింది.

సూచనల పట్టిక విడుదల చేసిన కేంద్రం..

కొవిడ్‌-19 వ్యాప్తి దృష్ట్యా సామాజిక దూరం పాటించాలని కేంద్రం పలు సూచనలు చేసింది. ఈ మేరకు పలు అంశాలతో కూడిన సూచనల పట్టికను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సూచనలన్నీ ఈనెల 31 వరకు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు అన్ని సూచనలు సమీక్షించనున్నట్లు వారు తెలిపారు. కరోనా వైరస్​ వ్యాప్తిని గురించి అనవసర పుకార్లు వ్యాప్తి చేయకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సలహా ఇచ్చింది సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ.

మహారాష్ట్రలో 144 సెక్షన్​..

వైరస్​ వ్యాప్తి అధికంగా ఉన్న నాగ్​పుర్, నాసిక్​​లో 144 సెక్షన్​ విధించారు. జన సమూహాల్ని నియంత్రించేందుకే ఈ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ముంబయిలో ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలను నిర్బంధించి.. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునేలా(వర్క్‌ ఫ్రం హోం) ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వీలైనంతవరకు సమావేశాలన్నింటినీ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానే జరపాలని ఆదేశించింది.

అయితే.. రాష్ట్రంలోని నగరాలను నిర్బంధించే ఆలోచన లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే తెలిపారు. జన సమూహాలను నియంత్రించేందుకు దేవాలయాలు, మసీదులు, చర్చిలతో సహా.. ఇతర బహిరంగ ప్రదేశాలను నిషేధించామని పేర్కొన్నారు.

దిల్లీ- షహీన్​బాగ్​లో..

దిల్లీలో మతపరమైన, కుటుంబ, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యకలాపాల నిమిత్తం 50 మందికి మించి ఒకేచోట చేరడాన్ని నిషేధించింది. ఈ నెలాఖరు వరకు ఇది కొనసాగుతుందని ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ అన్నారు. జిమ్​లు, క్లబ్బులు, స్పాలపైనా మార్చి 31 వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని సీఎం చెప్పారు. పెళ్లిళ్లపై నిషేధమేమీ లేదన్న సీఎం... వీలైతే వాటిని వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. సంపన్న వర్గాలను దృష్టిలో ఉంచుకొని మూడు హోటళ్లలోనూ క్వారంటైన్​ సదుపాయం కల్పించినట్లు తెలిపారు.

'జూ'పై తప్పని నిషేధం..

పంజాబ్​లోని అన్ని జంతుప్రదర్శనశాలల్ని మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 31 వరకు ఈ నిర్బంధం కొనసాగుతుందని తెలిపింది. ఫలితంగా చండీగఢ్​లోని ప్రధాన జూ సహా.. చుట్టుపక్కల ప్రాంతాల్లోని మరో నాలుగు ప్రదర్శనశాలలు మూతపడ్డాయి.

ఇదీ చదవండి: కరోనా @110: భారత్​ను కలవరపెడుతోన్న కొవిడ్​-19 కేసులు

Last Updated : Mar 17, 2020, 6:13 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.