ETV Bharat / bharat

దేశంలో మరో 75 మందికి కరోనా- 17 మంది మృతి - Covid-19 latest news

కరోనా వ్యాప్తిపై ప్రకటన విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. కొత్తగా 75 మందికి వ్యాధి సోకినట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో వైరస్ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేసింది. వైరస్ నియంత్రణ కోసం సంబంధిత శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు ఆరోగ్య శాఖ అధికారులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే సూచనలు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.

corona
దేశంలో పెరిగిన కరోనా కేసులు
author img

By

Published : Mar 27, 2020, 5:48 PM IST

Updated : Mar 27, 2020, 8:33 PM IST

దేశంలో కొత్తగా 75 మందికి కరోనా సోకినట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ. గత 24 గంటల్లో వైరస్ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేసింది. మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 724కు పెరగగా.. మృతుల సంఖ్య 17కు చేరింది.

లాక్​డౌన్ నిబంధనలను పాటిస్తూ ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు సూచించారు ఆరోగ్య శాఖ అధికారులు. సామాజిక దూరం పాటించాలన్నారు. దేశంలో ఒక్కరు నిబంధనలను అతిక్రమించినా మనం చేసే ప్రయత్నాలు విఫలమవుతాయని హెచ్చరించారు.

corona
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

మనం భాగస్వాములమవుతాం..

కొవిడ్-19కు విరుగుడుగా కనిపెట్టబోయే ఔషధం తయారీలో త్వరలో భారత్​ కూడా భాగస్వామి కానుందని స్పష్టం చేశారు భారత వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ బలరాం భార్గవ.

వెంటిలేటర్ల కోసం..

వెంటిలేటర్ల కొరత లేకుండా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు అధికారులు. 30,000 వెంటిలేటర్లను తయారు చేయాలని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్​ (బెల్)ను కోరినట్లు వెల్లడించారు.

వర్క్​ ఫ్రం హోం..

కరోనా లాక్​డౌన్​ దృష్ట్యా 1, 40,000 కంపెనీలు ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం ద్వారా పనిచేసేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.

వలస కూలీల బాధ్యత మరవొద్దు..

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వలస కూలీలుగా పనిచేస్తున్నవారి సంక్షేమంపై చర్యలు తీసుకోవాలని ఆయా ప్రభుత్వాలకు సూచించారు ఆరోగ్య శాఖ అధికారులు. వైరస్ నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమలులో ఉన్న కారణంగా వలస కూలీలకు వసతి, ఆహారం అందించాలని కోరారు.

రోగులకు టెలీ మెడిసిన్..

వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారి సౌలభ్యం కోసం టెలీ మెడిసిన్ సౌకర్యాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు ఆరోగ్య శాఖ అధికారులు. ఈ సదుపాయాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: ఐపీఎల్​ ఫైనల్​కన్నా మోదీ 'లాక్​డౌన్​ స్పీచ్'​కే అధిక రేటింగ్​

Last Updated : Mar 27, 2020, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.