ETV Bharat / bharat

అసోంలో ఆగని వరదలు.. 6 లక్షల మందిపై ప్రభావం - Assam floods

అసోంలో వరదలు మరింత ఉద్ధృతమయ్యాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహించడం వల్ల వరద నీరుతో 20 జిల్లాలు ముంపునకు గురయ్యాయి. ఆరు లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారు. మరో ఇద్దరు చనిపోవడం వల్ల మృతుల సంఖ్య 66కు పెరిగింది. పలు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Assam flood: Over 6 lakh people affected, 2 more deaths
అసోంలో ఆగని వరదలు.. ఆరు లక్షల మందిపై ప్రభావం
author img

By

Published : Jul 12, 2020, 11:32 AM IST

అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరద నీరు 20 జిల్లాలకు వ్యాపించింది. ఇప్పటివరకు 6.02 లక్షల మంది ప్రభావితమయ్యారు. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో వరదల్లో మరణించినవారి సంఖ్య 66కు పెరిగింది.

అసోంలో ఆగని వరదలు.. ఆరు లక్షల మందిపై ప్రభావం
Assam flood: Over 6 lakh people affected, 2 more deaths
సగం మునిగిపోయిన ఇల్లు

నడుము లోతు నీటిలో మహిళలు

ఈ జిల్లాల్లో అధికంగా..

వరద ప్రభావిత జిల్లాల్లో ధెమాజీ తర్వాత బార్పేట్​,​ లఖింపూర్ జిల్లాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయి.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర

వరద నీటి తాకిడికి కరిగిపోతున్న గట్టు

వరద ప్రభావం.. సహాయక చర్యలు

  • అసోం రాష్ట్రవ్యాప్తంగా 1,109 గ్రామాలు జలమయం.
  • 46,082 హెక్టార్ల మేర నీటమునిగిన పంట.
  • 11 జిల్లాల్లో 92 సహాయ శిబిరాలు, పంపిణీ కేంద్రాలను ఏర్పాటు.
  • శిబిరాల్లో 8,474 మందికి ఆశ్రయం.
  • పలు జిల్లాల్లో పూర్తిగా దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, కల్వర్టులు, ఇతర మౌలిక సదుపాయాలు.
  • కాజీరంగ జాతీయ పార్కు సహా పోబిటోరా వన్యప్రాణి అభయారణ్యం, ​​రాజీవ్ గాంధీ ఒరాంగ్ జాతీయ పార్కుకు ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఎక్కువ భాగం నీటమునిగింది.

    ఇంటిలోకి చేరిన వరద నీరు

    ఇంటిలోకి ప్రవేశించిన వరద నీరు

    వరద ప్రభావిత ప్రాంతాల నుంచి పడవలో వస్తున్న ప్రజలు

ఇదీ చూడండి: దేశంలో మరో 28,637 కేసులు.. 551 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.