ETV Bharat / bharat

వారిలో 43 మంది మొదటిసారి రాజ్యసభకు ఎన్నిక

author img

By

Published : Jun 20, 2020, 5:49 AM IST

రాజ్యసభలో ఖాళీగా ఉన్న 61 స్థానాలకు ఎన్నికలు పూర్తై ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే.. ఈసారి పెద్దల సభకు వెళుతున్నవారిలో 43 మంది (72 శాతం) కొత్తవారేనని రాజ్యసభ సచివాలయ పరిశోధన విభాగం వెల్లడించింది. శుక్రవారం 19 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వారిలో 15 మంది గత అనుభవం లేనివారేనని తెలిపింది.

43 first timers to enter Rajya Sabha
రాజ్యసభకు ఎన్నికైన వారిలో 72 శాతం మంది కొత్తవారే!

రాజ్యసభలో ఖాళీగా ఉన్న 61 సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. 42 మంది ఏకగ్రీవంగా ఎన్నికవగా.. 19 సీట్లకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించి ఫలితాలు వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన వారిలో 43 మంది మొదటిసారి పెద్దల సభలో అడుగుపెడుతున్నట్లు రాజ్యసభ పరిశోధన విభాగం వెల్లడించింది. అది భర్తీ చేసిన ఖాళీ సీట్లలో 72 శాతంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

" గెలుపొందిన వారిలో 12 మంది పదవీవిరమణ పొందినవారు తిరిగి ఎన్నికయ్యారు. గత అనుభవం ఉన్న మరో ఏడుగురు తిరిగి పెద్దల సభలో అడుగుపెడుతున్నారు. దాంతో రాజ్యసభ సభ్యుల సగటు అనుభవం 63 పర్యాయాలకు పడిపోనుంది."

- సీనియర్​ అధికారి, ఆర్​ఎస్​ పరిశోధన విభాగం.

20 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 61 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఇప్పటికే 42 మంది ఏకగ్రీవంగా ఎన్నికవగా అందులో 28 మంది తొలిసారి పెద్దల సభకు ఎన్నికయ్యారు. మరో 19 స్థానాలకు ఎన్నికలు జరగగా.. అందులో 15 మంది అనుభవం లేనివారు ఉన్నారు.

మొదటిసారి ఎన్నికైన ప్రముఖులు..

పెద్దల సభకు మొదటిసారి ఎన్నికైన వారిలో జోతిరాదిత్య సింధియా, మల్లికార్జున్​ ఖర్గే, ఎం తంబిదురై (లోక్​సభ మాజీ డిప్యూటీ స్పీకర్​), కేసీ వేణుగోపాల్​, కేఆర్​ సురేశ్​ రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు ఉన్నారు.

12 మంది సిట్టింగ్​ ఎంపీలు..

12 మంది రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారే తిరిగి ఎన్నికయ్యారు. వారిలో భువనేశ్వర్​ కలిత (5వసారి), ప్రేమ్​చంద్​ గుప్తా (5వ సారి), తిరుచి శివ (4వ సారి), కే.కేశవరావు, బిస్వజిత్​ దయమారి, పరిమల్​ నథ్వాని (3వ సారి), శరద్​ పవార్​, రామ్​దాస్​ అథావాలే, హరివంశ్​, దిగ్విజయ్​ సింఘ్​, కేటీఎస్​ తులసి, రామ్​నాద్​ ఠాకూర్​లు.. 2వసారి ఎన్నికయ్యారు.

గత అనుభవంతో ఆరుగురు

గతంలో రాజ్యసభకు ఎన్నికైన అనుభవం ఉన్న వారు ఆరుగురు తిరిగి పెద్దల సభకు వెళ్తున్నారు. అందులో జీకే వాసన్​, దినేశ్​ త్రివేది, నబమ్​ రాబియా (3వసారి), దేవేగౌడ, శిబు సొరెన్​, ఓక్రమ్​ సింగ్​ లఖవాత్​ (రెండవసారి) ఎన్నికయ్యారు.

ఇదీ చూడండి: 8 స్థానాల్లో భాజపా గెలుపు.. 4 సీట్లు కాంగ్రెస్​ కైవసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.