దేశంలో సార్వత్రిక ఎన్నికల పర్వం పూర్తయింది. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే మరోసారి అధికారం దక్కుతుందని అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి... అంచనాలకు తగినట్టే తుది ఫలితాలను వచ్చాయా అనే విషయాలను పరిశీలిద్దాం.
2004, 2009 విఫలం
2004, 2009 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. యూపీఏ, ఎన్డీఏల మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయి. రెండు సార్లూ యూపీఏ కూటమి సునాయసంగానే అధికారం చేజిక్కించుకుంది.
2014 ఎగ్జిట్ పోల్స్
2014లో మొత్తం 7 సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించగా అందులో న్యూస్-24 చాణక్య మాత్రమే దాదాపు కచ్చితమైన ఫలితాలను అంచనా వేయగలిగింది. ఎన్డీఏకు 340 సీట్లు వస్తాయని పేర్కొనగా.. అప్పటి ఎన్నికల్లో 336 సీట్లు వచ్చాయి. యూపీఏ కూటమికి 70 సీట్లు అంచనా వేయగా 59 సీట్లు వచ్చాయి.
ఎగ్జిట్ పోల్స్ | ఎన్డీఏ | యూపీఏ |
న్యూస్ 24 చాణక్య | 340 | 70 |
ఇండియా టీవీ-సీ ఓటర్ | 289 | 101 |
ఏబీపీ నిల్సన్ | 281 | 97 |
సీఎన్ఎన్-ఐబీఎన్ సీఎస్డీఎస్ | 280 | 97 |
హెడ్‌లైన్స్ టుడే సిసీరో | 272 | 115 |
ఎన్డీటీవీ | 279 | 103 |
టైమ్స్ నౌ-ఓఆర్జీ | 249 | 148 |
ఈసారి అన్ని సంస్థలు ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ప్రకటించాయి. సుమారు 300 పైచిలుకు సీట్లు సాధిస్తుందని తెలిపాయి. కానీ ఏబీపీ న్యూస్, నేత న్యూస్ ఎక్స్ మాత్రమే అధికార కూటమికి మెజారిటీ తగ్గిపోతుందని తెలిపాయి. ఎన్డీఏకు 267 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ చెప్పగా, న్యూస్ ఎక్స్ 242 వస్తాయని తెలిపింది.
ఏ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఎంత కచ్చితమైన ఫలితాలను అంచనా వేశాయో మరో రెండు రోజుల్లో తేలనుంది.
ఇదీ చూడండి: ఆచితూచి వ్యవహరిస్తోన్న ఎస్పీ, బీఎస్పీ..!