ETV Bharat / bharat

దేశంలో ప్రతి గంటకు 82 మందికి కరోనా - భారత్​లో ఒక్క రోజులో అత్యధికంగా నమోదైన కేసుల సంఖ్య

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే అత్యధికంగా 1,975 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 26,917కి చేరింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి గంటకు సగటున 82.29 మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.

india new record in corona cases
కరోనా కేసుల్లో భారత్ కొత్త రికార్డు
author img

By

Published : Apr 27, 2020, 6:53 AM IST

కరోనా కేసుల్లో ఆదివారం కొత్త రికార్డు నమోదైంది. 24 గంటల్లోనే దేశంలో 1,975 కేసులొచ్చాయి. వీటిలో 1,585 కేసులు పది రాష్ట్రాల్లోనే వచ్చాయి. గరిష్ఠంగా మహారాష్ట్రలో 811 కొత్త కేసులు కనిపించాయి. పెరుగుదలలో ఈ రాష్ట్రం వాటా ఒక్కటే 41.06% ఉంది. దేశంలో ప్రతి గంటకు సగటున 82.29 మందికి వైరస్‌ సోకినట్లు తాజా లెక్కలను బట్టి తెలుస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26,917కి చేరింది. అందులో 5,914 మంది కోలుకోగా, 826 మంది కన్నుమూశారు. 24 గంటల్లో 704 మంది కోలుకోవడం కూడా కొత్త రికార్డు. ఇది శనివారం కంటే దాదాపు రెట్టింపు. కోలుకున్నవారి సంఖ్య 22%కి పెరగడం, మరణాల నిష్పత్తి 3.06%కి తగ్గడం కొంత సానుకూల అంశం. ఈ నెలలో ఇప్పటివరకూ ఒక్కరోజులో గరిష్ఠంగా 24న 1,752, 20న 1,540 కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటితో ఆ రెండు రికార్డులు చెరిగిపోయాయి. ఆదివారం ఉదయం వరకు ఐసీఎంఆర్‌ 6,25,309 మందికి పరీక్షలు నిర్వహించగా సగటున 4.30% మందికి పాజిటివ్‌ వచ్చింది. పరీక్షలు చేసిన ప్రతి 23 మందిలో ఒకరికి వైరస్‌ సోకింది.

corona cases details
భారత్​లో కరోనా కేసుల వివరాలు

దేశ రాజధానిలో..

దేశ రాజధానిలోని బాబూ జగ్జీవన్‌రామ్‌ ప్రభుత్వాసుపత్రిలో 19 మంది నర్సింగ్‌ సిబ్బంది కరోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో ఆ ఆసుపత్రిలో మొత్తం 65 మందికి కరోనా సోకినట్లయింది. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 22 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా మరణించిన వారిలో 342 మంది ఈ రాష్ట్రం వారే.

lock down Impact in delhi
లాక్​డౌన్​ అమలవుతున్న కారణంగా దిల్లీలోని శారదా బజార్​లోకి ఇతరులు రాకుండా అడ్డుగా ఉంచిన ఎద్దుల బండ్లు

పలు రాష్ట్రాల్లో పరిస్థితి..

  • ఒడిశాలో 24 గంటల్లో 9 మందికి కరోనా సోకిన నేపథ్యంలో మరిన్ని ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువ కేసులున్న జిల్లాల్లో పలు ప్రాంతాలను పూర్తిగా దిగ్బధం చేశారు. మూడు జిల్లాల్లో విధించిన 60 గంటల సంపూర్ణ లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగిసింది.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనాను జయించి బయటపడినవారిలో మూడు నెలల శిశువు, 82 ఏళ్ల వృద్ధ మహిళ కూడా ఉన్నారు. 75 జిల్లాలకు గానూ 58 జిల్లాల్లో వైరస్‌ బాధితులు ఉన్నారు.
  • మధ్యప్రదేశ్‌లో కరోనా మరణాలు 103కి చేరాయి.
  • హరియాణాలో ఒక మహిళా ఎస్సై సహా 9 మంది కరోనా బారినపడ్డారు.
  • కేరళలో కొత్తగా ఒక వైద్యురాలు, ముగ్గురు ఆరోగ్య సిబ్బంది సహా 11 మందికి కరోనా సోకింది. హాట్‌స్పాట్లు 87కి పెరిగాయి. వేర్వేరు దేశాల్లో చిక్కుకుపోయిన కేరళవాసులు సొంత రాష్ట్రానికి వచ్చేందుకు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకునే సదుపాయాన్ని 'ప్రవాస కేరళవాసుల వ్యవహారాల విభాగం' అందుబాటులోకి తెచ్చింది.
    state wise
    రాష్ట్రాల వారీగా

ఎన్డీఎంఏ లెక్క 28,909

కరోనా కేసులకు సంబంధించి హోంశాఖ ఆధ్వర్యంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతున్న లెక్క వేరేగా ఉంటోంది. ఈ సంస్థ డ్యాష్‌బోర్డ్‌ ప్రకారం ఆదివారం రాత్రి 9 వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 28,909. ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించినదానికంటే ఇది 1,992 ఎక్కువ.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు ఓఎస్డీగా ఉన్న అధికారి కార్యాలయం వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. ఎయిమ్స్‌ బోధనా విభాగంలో ఓఎస్డీ కార్యాలయం ఉంది. ఓఎస్డీ, ఇతర సిబ్బందిని స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా వైద్య నిపుణులు సూచించారు.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్: మ్యాజిక్ మరిచి కూరగాయల అమ్మకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.