ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్: మ్యాజిక్ మరిచి కూరగాయల అమ్మకం

కరోనాతో సమాజంలోని అన్ని వర్గాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. పనిచేసుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు కరోనా వైరస్ కారణంగా కష్టాలు రెట్టింపయ్యాయి. తన మ్యాజిక్​తో ఎంతో మందిని మెప్పించిన ఓ కళాకారుడు.. మహమ్మారి విజృంభణ కారణంగా ఉపాధి కోల్పోయి కూరల అమ్మకం ప్రారంభించాడు.

magic
మ్యాజిక్ వృత్తి మరచి.. కూరల అమ్మకానికి!
author img

By

Published : Apr 27, 2020, 12:03 AM IST

అతని మ్యాజిక్‌కు ఫిదా అవ్వని వీక్షకులు ఉండరంటే అతిశయోక్తికాదు, తన మాయాజాలంతో ఎంతో మంది మన్ననలు పొందాడు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదంటారు. మ్యాజిక్‌ చేసిన ఆ చేతులతోనే కూరగాయల బండిని తోసే పరిస్థితి కల్పించింది. కరోనా నియంత్రణ కోసం కేంద్రం లాక్‌డౌన్‌ విధించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. వారిలో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌ జిల్లాకు చెందిన రాజు మహోర్ కూడా ఉన్నాడు‌. 15 సంవత్సరాలుగా మెజీషియన్‌ కళనే ఉపాధిగా చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. కరోనా కట్టడికి కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో కార్యక్రమాలు లేక బతుకుతెరువు కోసం కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఒక్క రాజు మహోర్‌ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతో మంది కళనే నమ్ముకొని జీవిస్తున్న వారిని పరిస్థితిని లాక్‌డౌన్‌ ఒక్కసారిగా మార్చేసిందనే చెప్పాలి.

"కరోనా సంక్షోభం నా వ్యాపారాన్ని పూర్తిగా మూసేసింది. నాతో పాటు పనిచేసిన డజను మంది లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి అద్దె కట్టడానికి, కుటుంబాన్ని పోషించటం కోసం నాకు కూరగాయలు అమ్మడం మినహా వేరే దారి కనిపించలేదు. గత 15 ఏళ్లలో ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎన్నో షోలు చేశాను. ఒక్కోసారి రోజుకు 8 నుంచి 10 దాకా షోలు చేసేవాడిని. చివరగా భిండ్, మొరేనా ప్రాంతాల్లో ప్రదర్శన చేశాను. లాక్‌డౌన్‌తో నా వస్తువులన్ని భిండ్‌లో ఉండిపోయాయి."

- రాజు, మెజీషియన్​

తన జీవితంలో ఇటువంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని, ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అభ్యర్థించాడు. త్వరలోనే పరిస్థితులు చక్కబడి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు రాజు.

ఇదీ చూడండి: వాట్సాప్​ స్టేటస్​లో కరోనా బాధితుల ఫొటో- చివరికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.