Attack on BJP Candidate: పంజాబ్‌లోని లుథియానా జిల్లా ఖేరీ గ్రామంలో అక్కడి భాజపా అభ్యర్థి సుచా రామ్ లాధర్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో.. గాయపడిన లాధర్ను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ జరిగింది..
లుథియానాలోని గిల్ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీచేయనున్న లాధర్.. ఖేరీ గ్రామంలోని ఓ సమావేశానికి హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఓ మూక ఆయన కారును అడ్డగించి ఇటుకలతో దాడి చేసింది. ఈ క్రమంలో గాయపడిన లాధర్ను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.



ప్రస్తుతం లాధర్ ఆరోగ్యం నిలకడగా ఉందని... ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అంతకుముందు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో లుథియానాలో నిర్వహించిన ర్యాలీలో లాధర్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి : అమరీందర్‌ను తొలగించడానికి కారణం అదే.. : ప్రియాంక