ETV Bharat / bharat

'ప్రభుత్వ శాఖల్లో 8.72 లక్షల ఖాళీలు' - యూనియన్​ పబ్లిక్​ సర్వీస్ కమిషన్​

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 8.72 లక్షల ఖాళీలున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్​ ప్రకటించారు. 2020 మార్చి 2 నాటికి సేకరించిన డేటా మేరకు.. రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు.

Ministry of Personnel
సిబ్బంది వ్యవహారాల శాఖ
author img

By

Published : Jul 29, 2021, 6:08 PM IST

కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల్లో 8.72 లక్షల ఖాళీలున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్​ తెలిపారు. 2020 మార్చి 2 నాటికి సేకరించిన సమాచారం.. ప్రభుత్వ విభాగాల్లో మొత్తం సామర్థ్యం 40,04,941 మంది కాగా.. ప్రస్తుతం 31,32,698 మంది సిబ్బంది ఉన్నట్లు రాజ్యసభలో ఆయన లిఖితపూర్వకంగా తెలిపారు.

గత ఐదేళ్లలో(2016-17 నుంచి 2020-21 వరకు) మూడు ప్రధాన నియామక ఏజెన్సీల ద్వారా సిబ్బంది నియామక ప్రక్రియను చేపట్టినట్లు జితేంద్ర పేర్కొన్నారు. యూనియన్​ పబ్లిక్​ సర్వీస్ కమిషన్​(యూపీఎస్​సీ) ద్వారా 25,267 మందిని, స్టాఫ్​ సెలక్షన్ కమిషన్(2,14,601), రైల్వే రిక్యూట్​మెంట్ బోర్డుల ద్వారా 2,04,945 మంది అభ్యర్థులను నియమించినట్లు సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి వివరించారు.

ఇదీ చూడండి: విపక్షాల రగడ- ఉభయసభలు రేపటికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.