ETV Bharat / bharat

ఇంజిన్ కింద కూర్చొని రైలు ప్రయాణం.. 190 కి.మీ వెళ్లిన తర్వాత!

author img

By

Published : Jun 7, 2022, 12:17 PM IST

Updated : Jun 7, 2022, 12:51 PM IST

Train journey under engine: ఇంజిన్​ కింద కూర్చొని ఓ వ్యక్తి రైలు ప్రయాణం చేశాడు. ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజంగా జరిగింది. మంచినీళ్లు కావాలని యువకుడు ఏడ్చేసరికి ఇంజిన్ డ్రైవర్ అతడిని గుర్తించాడు. ఆ తర్వాత ఏమైందంటే..?

itting-underneath-train-engine
itting-underneath-train-engine

యువకుడిని బయటకు తీస్తున్న ప్రయాణికులు

Train journey under engine: రైల్ఇంజిన్ కింద వేలాడుతూ వందల కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ వ్యక్తి. ఇంజిన్ చక్రాలపై కూర్చొని 190 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. బిహార్​లోని గయాకు చేరుకున్న తర్వాత డ్రైవర్ అతడిని గుర్తించాడు. ఆ యువకుడికి మతిస్థిమితంగా లేదని అధికారులు చెబుతున్నారు. పట్నా మీదుగా రాజ్​గిర్ నుంచి వస్తున్న బుద్ధ పూర్ణిమ ఎక్స్​ప్రెస్​లో ఈ ఘటన జరిగింది.

travelling sitting underneath train
యువకుడిని బయటకు తీస్తున్న ప్రయాణికులు

వివరాల్లోకి వెళితే..: ఇంజిన్​లో కూర్చున్న డ్రైవర్​కు ఓ వ్యక్తి ఏడుస్తున్నట్లు శబ్దం వినిపించింది. గయా జంక్షన్​లో రైలు ఆగిన తర్వాత ఇంజిన్ కింది భాగాన్ని ఓసారి పరిశీలించాడు డ్రైవర్. ఎవరో ఓ వ్యక్తి మంచినీళ్లు కావాలని అరుస్తున్నట్లు డ్రైవర్ గుర్తించాడు. టార్చ్​లైట్ వేసి చూడగా.. ఇంజిన్​ కింది భాగంలో కూర్చొని ఉన్న వ్యక్తిని చూశాడు. కొందరు ప్రయాణికుల సాయం తీసుకొని యువకుడిని బయటకు తీశాడు. అయితే, అంతలోనే ఆ యువకుడు అదృశ్యమయ్యాడు. యువకుడి వివరాలేవీ తెలియలేదు. యువకుడు ఎక్కడ రైలెక్కాడో తెలియదని అధికారులు చెప్పారు. ఈ విషయంపై డ్రైవర్.. రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు.
రైల్వే పోలీసులు ఈ ఘటనపై పెద్దగా వివరాలు చెప్పలేదు. రాజ్​గిర్​లో యువకుడు రైలు ఎక్కి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. యువకుడు క్షేమంగా ఇక్కడికి చేరడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 7, 2022, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.