ETV Bharat / bharat

కోర్టు అల్మారాలో ఉన్న 400 ఫైళ్లు మాయం.. చోరీనా? లేక కుట్రనా? - అసన్సోల్‌ కోర్టులో 400 ఫైళ్లు చోరీకి గురయ్యాయి

కోర్టు అల్మారాలో ఉన్న 400 ఫైళ్లు చోరీకి గురయ్యాయి. కేసు నమోదు చేసుకున్న​ పోలీసుల దర్యాప్తు చేపడుతున్నారు. బంగాల్​లో వెలుగుచూసిందీ ఘటన.

Asansol court
కోర్టు
author img

By

Published : Dec 5, 2022, 8:29 PM IST

బంగాల్​లోని అసన్సోల్‌ కోర్టులో ఆదివారం అర్థరాత్రి దుండగులు డోర్‌ తాళాలు పగలగొట్టి అల్మారాల్లో ఉన్న 400 ఫైళ్లు చోరీ చేశారు. అసన్సోల్ కోర్టు ప్రాంగణంలో ఉన్న మొదటి మున్సిఫ్ కోర్టులో ఈ ఘటన జరిగింది. ఈ విషయమై కోర్టుకు చెందిన హెడ్ క్లర్క్ అరూప్ దాస్, పేష్కర్ పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న మిగతా ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో విచారించేందుకు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన కొన్ని ఫైళ్లను అసన్సోల్ చర్చి యార్డ్‌లో పాత పేపర్లు అమ్ముతున్న వ్యాపారి దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ దొంగతనం కేవలం కాగితాల అమ్మకం కోసమేనా లేదా ఏదైనా కుట్రలో భాగంగా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.