ETV Bharat / bharat

నలుగురు పిల్లల తల్లితో యువకుడి 'ప్రేమ వివాహం' - bihar love marriage

ఆమె వయసు 41 ఏళ్లు. నలుగురు పిల్లలు. అయితేనేం.. 21 ఏళ్ల యువకుడిని ప్రేమించింది. వారి ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు కుటుంబసభ్యులకు, గ్రామస్థులకు తెలిసింది. దీంతో ఇద్దరికీ వివాహం చేశారు. ఈ షాకింగ్ ఘటన బిహార్​లో జరిగింది.

MARRIAGE
పెళ్లి
author img

By

Published : Aug 20, 2021, 2:00 PM IST

పెళ్లి

ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమకు కులమతాలు లేవంటారు. సరిగ్గా అలాంటి ఘటనే బిహార్​లో జరిగింది. అవును.. 41ఏళ్ల మహిళ, 21ఏళ్ల యువకుడి ప్రేమాయణం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఏం జరిగిందంటే..?

బిహార్, ఖగడియా జిల్లా పంచ్​కుటీ మండలం దరియాపుర్ పంచాయతీ పరిధిలోని నయాగావ్​కు చెందిన మనతి దేవికి 41ఏళ్లు. ఆమెకు నలుగురు పిల్లలు. భర్త మరణించాడు. అయితే జొరావర్​పుర్​కు చెందిన రవికుమార్​(21)తో పరిచయం ఏర్పడింది. గత రెండేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు వేరువేరు కులస్థులు. రవికుమార్.. మనతి దేవి ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు.

అయితే ఆగస్టు 16న సాయంత్రం.. రవికుమార్.. మనతి ఇంట్లో ఉండటం గ్రామస్థులు చూశారు. రవికుమార్​ను పట్టుకుని.. అతడి కుటుంబసభ్యులకు కబురు పెట్టారు. దరియాపుర్ సర్పంచ్​ శంబు సింగ్, జొరవాపుర్ సర్పంచ్ పంకజ్ షా.. మనతి ఇంటి వద్దకు చేరుకున్నారు. సర్పంచ్​ల ఆధ్వర్యంలో గ్రామస్థులు, కుటుంబసభ్యులు కలిసి ఇద్దరికీ వివాహం చేశారు.

మొత్తం నలుగురు పిల్లల్లో ఇద్దరు పిల్లలను కొత్త జంట వద్ద, మరో ఇద్దరిని మనతి తల్లి వద్ద ఉంచేలా అంగీకారం కుదిరింది. వివాహం తర్వాత.. మనతిని రవి కుమార్​ వెంట పంపిచారు గ్రామస్థులు.

ఇదీ చదవండి: తిమింగలం వాంతితో రూ.23కోట్ల దందా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.