ETV Bharat / snippets

పెళ్లిచూపులకు వెళ్తూ - రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతి

Software Engineer Dies in Road Accident
Software Engineer Dies in Road Accident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 6:33 PM IST

Updated : Jun 23, 2024, 7:13 PM IST

Software Engineer Dies in Road Accident: శనివారం రాత్రి జూబ్లీహిల్స్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతి చెందాడు. పెళ్లి చూపుల కోసం స్వగ్రామానికి వెళ్తుండగా, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మీనుగ శివశంకర్ అనే యువకుడు మృతి చెందాడు. గత అర్ధరాత్రి మాదాపూర్​లోని హాస్టల్ నుంచి వనపర్తి జిల్లా, లక్ష్మీపల్లి గ్రామానికి శివశంకర్ బైక్​పై బయలుదేరాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ వన్​ సమీపంలో టిప్పర్ ఢీకొనడంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి ఆధారమైన శివశంకర్ మృతితో కుటుబసభ్యులు కన్నీరు మున్నిరుగా విలపిస్తున్నారు. శివశంకర్ తల్లిదండ్రులు సుధాకర్, కృష్ణమ్మలు వ్యవసాయం చేస్తుండగా, రెండో కుమారుడు మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు.

Last Updated : Jun 23, 2024, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.