ETV Bharat / snippets

మేడిగడ్డకు మళ్లీ పీసీ ఘోష్ కమిటీ - అఫిడవిట్ల పరిశీలన తర్వాత చర్యలు

PC Ghose Committee To Revisit To Medigadda
PC Ghose Committee To Revisit To Medigadda (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 9:36 AM IST

PC Ghose Committee To Revisit To Medigadda : కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ శుక్రవారం మరోమారు రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన నీటిపారుదల శాఖ ఇంజనీర్లను కమిషన్ ఇప్పటికే విచారించింది. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారించారు. అందరినీ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు.

అఫిడవిట్ల దాఖలుకు గడువు కూడా ఇప్పటికే ముగిసింది. వచ్చిన అఫిడవిట్లు అన్నింటినీ పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత తదుపరి ప్రక్రియ చేపట్టనున్నారు. వాటిలోని సమాచారం, వివరాల ఆధారంగా అవసరమైన వారికి నోటీసులు జారీ చేయనున్నారు. బహిరంగ విచారణకు కూడా కమిషన్ సిద్ధమవుతోంది. ఈ దఫాలో జస్టిస్ పీసీ ఘోష్ పది రోజుల పాటు ఇక్కడే ఉంటారని సమాచారం. పరిస్థితులను బట్టి కొన్ని పర్యటనలకు కూడా వెళ్లవచ్చని అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.