US Europe Lock Up Russian Assets : ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు మాస్కో పరిహారం చెల్లించే వరకు, రష్యా ఆస్తులు లాక్ చేయాలని అమెరికా, యురోపియన్ యూనియన్ అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా సీనియర్ అధికారి ఒకరు గురువారం వివరాలు వెల్లడించారు. దీంతో జీ7 మీటింగ్‌లో ఉక్రెయిన్‌కు 50 బిలియన్ డాలర్ల లోన్ ప్యాకేజీని ప్రకటించేందుకు నేతలకు మార్గం సుగమమైంది. మరోవైపు జీ7 దేశాల వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ బయలుదేరారు. జీ7 చర్చల్లో భాగంగా కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా, గ్లోబల్ సౌత్ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనే ఇతర నేతలతో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
'రష్యా అలా చేసే వరకు ఆ దేశ ఆస్తులు లాక్ చేస్తాం'- ఉక్రెయిన్‌కు సపోర్ట్‌గా అమెరికా, EU మాస్టర్ ప్లాన్!
Published : Jun 13, 2024, 10:16 PM IST