ETV Bharat / snippets

6రోజులు సోషల్ మీడియా మొత్తం బ్యాన్- ప్రభుత్వం కీలక నిర్ణయం- ఎందుకంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 10:22 AM IST

Social Media Ban
Social Media Ban (ETV Bharat)

Pakistan Social Media Ban : పాకిస్థాన్​లోని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొహర్రం సందర్భంగా ద్వేషపూరిత విషయాలను నియంత్రించేందుకు జులై 13-18 వరకు ఆరు రోజులపాటు సోషల్ మీడియా వేదికలన్నింటిపై బ్యాన్ విధించింది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్ట్రాగ్రామ్, టిక్​టాక్ వంటి యాప్స్​పై ఆరు రోజుల పాటు నిషేధం ఉండనుంది.

మతపరమైన హింసను నివారించడానికి, తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి, విద్వేషపూరిత విషయాలను నియంత్రించడానికే సోషల్ మీడియాపై బ్యాన్ విధించామని పంజాబ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్​పై పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇటీవలే సోషల్ మీడియాపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాను విషపూరిత మీడియాగా అభివర్ణించారు. అలాగే డిజిటల్ టెర్రరిజంతో పోల్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.