ETV Bharat / snippets

కొత్త అవతారం ఎత్తిన హీరో నాని - హిట్ 3 కోసం అలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 1:55 PM IST

source ETV Bharat
Nani (source ETV Bharat)

Nani Hit 3 Movie : నేచుర‌ల్ స్టార్ నాని ఇప్ప‌టికే స‌రిపోదా శ‌నివారం షూటింగ్​ను పూర్తి చేసి రిలీజ్​కు రెడీ చేశారు. ఈ సినిమా తర్వాత తన హోం బ్యానర్​లో హిట్-3 చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే హిట్, హిట్-2 బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యాల‌ను అందుకోవ‌డంతో ఇప్పుడు హిట్-3పై అంచ‌నాలు ఉన్నాయి. దీనిని ద‌ర్శకుడు శైలేశ్​ కొల‌ను ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అయితే, ఈ మూవీ కోసం నాని కొత్త అవతారం ఎత్తినట్లు తెలిసింది. కేవ‌లం హీరోగానే కాకుండా రైటర్​గా మారి సినిమాకు సంబంధించి స్టోరీ లైన్​ను స్వ‌యంగా రాసుకున్నారట‌. దానిని ఆధారంగా చేసుకుని దర్శకుడు శైలేశ్‌ కొలను స్క్రిప్ట్‌ సిద్ధం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మూవీ షూటింగ్​ను సెప్టెంబ‌ర్​లో స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. సినిమాలో నాని అర్జున్ స‌ర్కార్ అనే ప‌వ‌ర్​ఫుల్​ పోలీస్​ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.