IMA Declares Nationwide Hunger Strike : బంగాల్ జూనియర్ డాక్టర్లకు మద్దతుగా అక్టోబరు 15న దేశవ్యాప్తంగా నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది. ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ (జేడీఎన్) ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్షలు జరుగుతాయని పేర్కొంది. ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో మహిళా జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశాన్ని విస్మయానికి గురిచేసింది. దీనితో బంగాల్ ప్రభుత్వం బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, వైద్యులకు రక్షణ కల్పించాలన్న డిమాండ్లతో జూడాలు నిరవధిక నిరాహార దీక్షలు చేపెట్టారు. ఆదివారంతో ఈ నిరాహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరింది. వీరి దీక్షలకు మద్దతుగా సోమవారం నుంచి వైద్యసేవలను నిలిపివేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్‌ఏఐఎంఏ) పిలుపునిచ్చింది. అయితే ఎమర్జెన్సీ సేవలను మాత్రం నిరంతరాయంగా కొనసాగించాలని తీర్మానించింది.
బంగాల్ జూడాలకు మద్దతుగా అక్టోబర్ 15న హంగర్ స్ట్రైక్: IMA
Published : Oct 14, 2024, 7:13 AM IST