ETV Bharat / snippets

ప్రధాని మోదీని కలిసిన ఒమర్ అబ్దుల్లా- జమ్ముకశ్మీర్​ రాష్ట్ర హోదా పునరుద్ధరణపై కేంద్రం హామీ!

Omar Abdullah Meets Modi
Omar Abdullah Meets Modi (PMO India (X))
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2024, 7:43 PM IST

Omar Abdullah Meets Modi : జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా దిల్లీలో పర్యటిస్తున్నారు. సీఎం అయ్యాక తొలిసారిగా దిల్లీ వెళ్లిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అంతకు ముందు హోంమంత్రి అమిత్‌షాను ఒమర్‌ కలిశారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశంపై ఇరువురితో చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఒమర్‌ మంత్రివర్గం తీర్మానం చేశారు. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు.

తాజా భేటీలో ఆ తీర్మానాన్ని ప్రధానికి అందించినట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హమీ లభించినట్లు జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. జమ్ముకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఎన్‌సీ-కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించి ఒమర్‌ అబ్దుల్లా ముఖ్యంమంత్రి అయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.