IPL 2025 Retention show : 2025 ఐపీఎల్ రిటైన్షన్స్కు గడువుకు సమయం దగ్గర పడుతోంది. అక్టోబర్ 31 సాయంత్రం 5.00 వరకు అన్ని ఫ్రాంచైజీలు వాళ్లు అట్టిపెట్టుకునే ప్లేయర్ల లిస్ట్‌ను అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని జట్టు రిటెన్షన్స్‌పై ఓ క్లారిటీకి వచ్చాయి. ఇప్పటికే రిటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్ట్ కూడా రెడీ చేసుకున్నాయి. అయితే ఏ జట్టు ఏయే ప్లేయర్లను అట్టిపెట్టుకుంది? ఎవరెవరిని వదులుకుంది? మెగా వేలంలోకి రానున్న స్టార్ ప్లేయర్లు ఎవరు? అనే దానిపై ఐపీఎల్ లవర్స్ ఆత్రుతగా ఉన్నారు.
అయితే ఐపీఎల్ మెగా వేలం మాత్రమే కాదు, ఈ రిటెన్షన్స్ కూడా లైవ్‌లో ప్రసారం కానున్నాయి. 'రిటెన్షన్ షో' పేరిట ఐపీఎల్ నిర్వాహకులు స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని జట్లు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్ట్‌ను లైవ్‌లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమాలో అక్టోబర్ 31 సాయంత్రం 4.30 గంటలకు ఈ రిటెన్షన్ షో ప్రారంభం కానుంది. అలాగే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెళ్లలో బ్రాడ్‌కాస్టింగ్ కూడా జరగనుంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఈ ప్రోగ్రామ్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, 2025 మెగా వేలం నవంబర్ ఆఖరి లేదా డిసెంబర్ తొలి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది.
ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ప్లేయర్లు (అంచనా*)
ముంబయి ఇండియన్స్ రిటెన్షన్స్ 2025
- రోహిత్ శర్మ
- సూర్యకుమార్ యాదవ్
- తిలక్ వర్మ
- జస్ప్రీత్ బుమ్రా
- హార్దిక్ పాండ్య
చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్స్ 2025
- రవీంద్ర జడేజా
- రుతురాజ్ గైక్వాడ్
- శివం దూబే
- ఎంఎస్ ధోని
- డెవాన్ కాన్వే
- మతీషా పతిరన
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్స్ 2025
- హెన్రిచ్ క్లాసెన్
- పాట్ కమిన్స్
- అభిషేక్ శర్మ
- ట్రావిస్ హెడ్
- నితీశ్ కుమార్ రెడ్డి
రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్స్ 2025
- విరాట్ కోహ్లీ
- మహ్మద్ సిరాజ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ రిటెన్షన్స్ 2025
- రింకూ సింగ్
- ఆండ్రీ రస్సెల్
- సునీల్ నరైన్
- హర్షిత్ రానా
రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్స్ 2025
- సంజూ శాంసన్
- యశస్వీ జైస్వాల్
- రియాన్ పరాగ్
దిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్స్ 2025
- అక్షర్ పటేల్
- కుల్దీప్ యాదవ్
- అభిషేక్ పోరెల్
గుజరాత్ టైటాన్స్ రిటెన్షన్స్ 2025
- శుభ్‌మన్ గిల్
- రషీద్ ఖాన్
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రిటెన్షన్స్ 2025
- నికోలస్ పూరన్
- మయాంక్ యాదవ్
పంజాబ్ కింగ్స్ రిటెన్షన్స్ 2025
- శశాంక్ సింగ్
- అశుతోష్ శర్మ
గుజరాత్ రిటెన్షన్ లిస్ట్ రెడీ- ఫ్రాంచైజీ ఓనర్ల మొగ్గు ఆ ప్లేయర్లకే!